Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsWPL 2023 | మరోచరిత్రకు తొలి అడుగు.. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి పోరులో గుజరాత్‌తో...

WPL 2023 | మరోచరిత్రకు తొలి అడుగు.. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి పోరులో గుజరాత్‌తో ముంబై ఢీ

WPL 2023 | టైమ్ 2 న్యూస్, ముంబై: ప్రతి ఏడాది వేసవిలో క్రీడాభిమానులకు మస్తు మజా నిచ్చే ఐపీఎల్ తరహాలో మరో లీగ్కు వేళైంది. మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి శుక్రవాం తెరలేవనుంది. అంతర్జాతీయ క్రికెట్లో కొత్త ఒరవడి సృష్టించిన ఐపీఎల్ తరహాలో.. రూపొందించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌)కు ముంబైలో అంకురార్పణ జరుగనుంది. ఐదు జట్లు తలపడనున్న ఈ సీజన్ తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. మొత్తం 21 మ్యాచ్ల పాటు జరుగనున్న ఈ లీగ్ మార్చి 26న ఫైనల్తో ముగియనుంది. ఎంతోకాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌)కు తొలి సీజన్ను శనివారం తెరలేవనుంది. ఈ లీగ్ తొలి సీజన్‌లో 21 మ్యాచ్లు నిర్వహించనుండగా.. ముంబైలోనే మ్యాచ్‌లు అన్నీ జరుగనున్నాయి. గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న మన అమ్మాయిలకు ఇది మరో చక్కటి అవకాశం కానుంది. ఉత్కంఠభరిత మ్యాచ్లో సత్తాచాటలేక మెగాటోర్నీల్లో విఫలమవుతున్న భారత ప్లేయర్లకు ఈ లీగ్ ఎంతగానో ఉపకరించనుంది. ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్ల్లో విఫలమవుతున్న మన అమ్మాయిలకు డబ్లూ్యపీఎల్ సరికొత్త దారి చూపనుందనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంతో పాటు.. హోరాహోరీ పోరాటాలతో మనవాళ్లు మరింత రాటుదేలడం ఖాయమే!

ఆర్భాటంగా ఆరంభోత్సవం..

మ్యాచ్‌లు అన్నీ రాత్రి 7.30 నుంచి ప్రారంభం కానుండగా.. శనివారం సాయంత్రం 5.30 నుంచే ఆరంభ వేడుకలు జరుగుతాయి. డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సినీతారలు పాల్గొననున్నారు. లీగ్ ఆరంభానికి ముందే.. ఫ్రాంచైజీల కొనుగోలుతో వార్తల్లోకెక్కిన డబ్లూ్యపీఎల్.. ఆటలోనూ సంచలనాలు నమోదు చేసేందుకు సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీలను బీసీసీఐ రూ. 4669 కోట్లకు అమ్మింది. దీంతో భారీ లాభం మూటగట్టుకున్న బోర్డు.. ప్రసారహక్కుల విక్రయంతోనే భారీ లాభాలను అర్జించింది. శనివారం జరుగనున్న ఆరంభోత్సవంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా పాల్గొననున్నారు. ఐపీఎల్ తరహాలోనే నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో అన్నీ ఫ్రాంచైజీలు కలిపి ప్లేయర్ల కోసం దాదాపు 60 కోట్లు వెచ్చించాయి. వేలంలో అందరికంటే అత్యధికంగా భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధనకు రూ. 3.4 కోట్లు పెట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దక్కించుకోగా.. హర్మన్ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్ వంటి వాళ్లు కూడా కోట్లు కొల్లగొట్టారు.

బెత్ మూనీ x హర్మన్‌ప్రీత్‌

ఆరంభ మ్యాచ్‌తోనే ప్రపంచ వ్యాప్త గుర్తింపు సాధించిన ఐపీఎల్ తరహాలోనే.. డబ్లూ్యపీఎల్ కూడా విజయవంతం కావాలని ఫ్రాంచైజీలు ఆశిస్తున్నాయి. లీగ్ ఆరంభ మ్యాచ్లో బెత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్తో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది. ముంబై టీమ్‌లో హర్మన్‌తో పాటు యస్తికా భాటియా, పూజ లాంటి టీమిండియా ప్లేయర్లతో పాటు.. అమేలీ కెర్, హీలీ మాథ్యూస్, నటాలియా స్కీవర్, హీథర్ గ్రహమ్ వంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. ఇటీవల మహిళల టీ20 ప్రపంచకప్‌లో దుమ్మురేపిన ఆసీస్ ప్లేయర్ బెత్ మూనీ గుజరాత్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నది. ఆమెతో పాటు స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్నర్ కీలకం కానున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు

Viral News | నాకు కేన్సర్ అని అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్.. డాక్టర్‌ను వేడుకున్న ఆరేళ్ల బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వైద్యుడి ట్వీట్!

Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్‌ చేసి బాధపడ్డ ప్రీతి

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News