Tuesday, May 28, 2024
- Advertisment -
HomeEntertainmentSaif Ali Khan | మీడియాపై సైఫ్‌ అలీ ఖాన్ అసహనం‌.. ఇంకెందుకు లేటు.. మా...

Saif Ali Khan | మీడియాపై సైఫ్‌ అలీ ఖాన్ అసహనం‌.. ఇంకెందుకు లేటు.. మా బెడ్ రూమ్‌లోకి రండి అంటూ ఆగ్రహం!

Saif Ali Khan | సెలబ్రిటీలు ఏ పని చేసిన దానిని వెంటనే మీడియాలో చూపించాలని చాలా మంది ఆసక్తి చూపిస్తూంటారు. వారు ఎక్కడికి వెళ్లిన, ఏం చేసినా, చివరికి ఏం తిన్నా కూడా అదో పెద్ద వార్త చేసేయాలనే ఆలోచనలో చాలా మంది ఉంటున్నారు.

కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఆలియా భట్‌ కూతురు ఫోటోల కోసం ఇద్దరు వ్యక్తులు వారి ఇంటి మీదకి కెమెరాలు ఫోకస్‌ చేసి పెట్టుకున్నారు.

దానిని గమనించిన ఆలియా ఏకంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు ఎంత ఎంజాయ్‌ చేసినప్పటికీ.. ఒక్కోసారి వారికీ విసుగొస్తుంది. తాజాగా బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ ఫోటోగ్రాఫర్స్‌తో విసిగిపోయి తన వెంట పడుతున్న వారి పట్ల అసహనం వ్యక్తం చేశాడు.

సైఫ్‌ తన భార్య కరీనా తో కలిసి ఓ పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో కొందరు వారిని కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించారు. కెమెరా ఫ్లాష్‌లు మెరుస్తూనే ఉన్నప్పటికీ ఒక్క ఫోటో ప్లీజ్‌ అంటూ కొందరు ఫోటోగ్రాఫర్లు సైఫ్‌, కరీనా వెంటపడ్డారు. దీంతో సైఫ్‌కు విసుగొచ్చింది. ఇక లాభం లేదనుకొని.. ” ఓ పని చేయండి.. మా బెడ్ రూమ్ లోకి రండి ” అంటూ కాస్త అసహనం వ్యక్తం చేశాడు.

గుడ్ నైట్ అని చెబుతూ.. ఇంట్లోకి వెళ్లిపోయి డోరు వేసేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. విరల్ భయానీ ఇన్‌స్టాగ్రామ్ లో ఈ వీడియోను షేర్ చేశాడు. సైఫ్, కరీనా జంటతోపాటు వాళ్ల పిల్లలు కూడా ఎప్పుడూ ఫోటోగ్రాఫర్లను ఆకర్షిస్తుంటారు. అయితే తన పెద్ద కొడుకు తైమూర్‌కు ఇలా ఫోటోలు తీయడం ఇష్టం ఉండదని గతంలో సైఫ్ ఒకసారి చెప్పాడు.

” అతనేమీ సెలబ్రిటీ కాదు.. కేవలం ఓ పిల్లాడు.. అతని వెంట పడకండి” అని కూడా సైఫ్ ఫోటోగ్రాఫర్లకు చెప్పాడు. సెలబ్రిటీలకు కూడా ప్రైవసీ ఉంటుందని, ఇలా వెంటబడటం సరి కాదని సైఫ్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. తాజాగా తన అసహనాన్ని కెమెరాల ముందే వెల్లగక్కాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rahul Gandhi | ఆ సమయంలో నన్ను చంపేసేవారమో.. రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Emoji | ఎమోజీల ట్రెండ్‌ ఎలా మొదలైంది? అవి పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

First Video on Youtube | యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటో తెలుసా

CRED CEO | ఆ కంపెనీ సీఈవో జీతం కేవలం 15 వేలే.. ఎందుకలా?

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News