Sunday, April 14, 2024
- Advertisment -
HomeLatest NewsTriangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన...

Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు

Triangle Love Story | ప్రేయసి దూరమైపోతుందన్న భయంతో హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో స్నేహితుడినే అత్యంత క్రూరంగా చంపిన కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ప్రియురాలి కోసం తన ఫ్రెండ్‌ నవీన్‌ను హరిహర కృష్ణ అత్యంత పాశవికంగా తల నరికి హత్య చేశాడు. చేతివేళ్లు, గుండె, మర్మాంగాలను కోసి.. ఆ ఫొటోలను ఆ అమ్మాయికి వాట్సాప్‌లో కూడా పంపించాడు. దేశవ్యాప్తంగా నవీన్‌ హత్య కేసు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో నిందితుడు హరిహర కృష్ణ తండ్రి ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడాడు. కేసుకు సంబంధించి పలు విషయాలను బయటపెట్టాడు.

‘ నా కొడుకు హరి మంచిగ చదువుకునేవాడు.. ఎస్సెస్సీలో ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. నవీన్‌, హరి ఇద్దరూ ఇంటర్‌ నుంచి ఫ్రెండ్స్‌. వీళ్లిద్దరూ ఎప్పుడూ కొట్టుకోలేదు. అమ్మాయి ప్రేమ వ్యవహారం తర్వాతనే గొడవలు వచ్చాయి. ఈ మర్డర్‌ వెనుక హరి ఒక్కడే లేడు. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్లు కూడా బయటకు రావాలి.’ అని ప్రభాకర్‌ మీడియాతో తెలిపారు. ‘ ఈ నెల 16న ఎగ్జామ్స్‌ అయిపోయినయి. హరికి ఫోన్‌ చేస్తే 17 లేదా18వ తేదీ వస్తా అని చెప్పిండు. 18వ తేదీ సాయంత్రం ఇంటికి వచ్చిండు. తెల్లారి 6 గంటలకే వెళ్లిపోయిండు. ఉండు బిడ్డా అంటే పని ఉంది పోవాల్లె అని చెప్పిండు. అప్పటికే మస్తు ఫోన్లు వస్తున్నయి. గిరి, సాయి ప్రీతమ్‌ ఇంకా నలుగురు ఐదుగురి నుంచి ఫోన్లు విపరీతంగా వచ్చినయి. ఊకే ఫోన్లు వస్తున్నయ్‌ ఏంటని అడిగితే పని ఉందని చెప్పి వెళ్లిండు. నేనే కారులో తీసుకెళ్లి హన్మకొండలో డ్రాప్‌ చేసిన. 20వ తేదీ నుంచి హరి దగ్గర నుంచి ఫోన్‌ లేదు. ఈ నెల 22వ తేదీ నుంచి ఆరోరా కాలేజీ నుంచి హెచ్‌వోడీ ఫోన్‌ చేసిండు. 20 రోజులుగా మీ అబ్బాయి కాలేజీకి రావట్లేదని ఫోన్లో చెప్పిండు. పరీక్షలకు కూడా వెళ్లాడు కదా ఇలా అంటున్నారేంటి ఆందోళన చెందాం. ఆ తర్వాత శంకర్‌ నాయక్‌ వాళ్ల బామ్మర్ది ఈ కాల్‌ చేయించినట్లు తెలిసింది. దీంతో ఏమైందా అని ఆందోళన చెందాం’ అని చెప్పుకొచ్చాడు.

అమ్మాయి కోసం గొడవైందని చెప్పాడు

‘ 23వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత హరి ఇంటికి వచ్చిండు. ఏం జరిగిందని నిలదీస్తే అసలు విషయం చెప్పిండు. కొట్టుకుంటే చనిపోయిండు అని చెప్పిండు. నిహారిక అనే అమ్మాయి గురించి గొడవ అయ్యిందని అన్నాడు. ఆ అమ్మాయి ఎవరు? మీకెలా పరిచయం అని అడిగితే అసలు విషయం చెప్పాడు. నవీన్‌, నిహారిక ముందు నుంచి ప్రేమించుకున్నారు. మూడు నాలుగేళ్లు కలిసి తిరిగిండ్రు అని అన్నాడు. ఆ తర్వాత నవీన్‌ను వదిలేసి మా అబ్బాయి వెంట పడింది. మా అబ్బాయికి ఐ లవ్యూ అని మెసేజ్‌ కూడా చేసింది’ అని హరి తండ్రి చెప్పాడు

ఆ రూం తీసుకున్నాకే అన్నీ మొదలయ్యాయి

‘ రెండు మూడు నెలల క్రితం హరి ఒక రూం తీసుకున్నాడు. అప్పట్నుంచే ఇవన్నీ స్టార్‌ అయినయి. ఆ రూంలో కూర్చొని ఏం చేసిర్రో తెల్వదు. కొంతమంది బెట్టింగ్‌ కట్టి పైసలు పోగొట్టుకున్నారు. మా అబ్బాయి కూడా డబ్బులు పోగొట్టుకున్నడు. ఈ మర్డర్‌ ఒక్కడు ఎట్ల చేస్తాడు. మద్యం మత్తులో చేసినా ఎవరో సాయం చేసి ఉండాలె. ఇద్దరే కొట్టుకుని ఉంటే దెబ్బలు మాత్రమే తగలాలి. ఇంకా వెనుక ఎవరో ఉన్నారు. వాళ్లు బయటకు వస్తేనే అసలు విషయం తెలుస్తది. నా కొడుకు ఒక్కడినే ఇరికించారు.. ఇంకా దీని వెనుక చాలామంది ఉన్నారని అన్నాడు. ఈ హత్యకు నిహారికనే సూత్రధారి అని స్పష్టం చేశాడు. అసలు ఆ రూం తీసుకున్నాకే అన్నీ మొదలయ్యాయి. ఆ రూంలో ఎవరెవరు ఉండేవాళ్లు. ఎవరెవరు వచ్చేవాళ్లు. అ అమ్మాయి రూంకి వచ్చేదా అన్నింటిపై విచారణ జరపాలి’ అని సూచించాడు.

కొడుకు చనిపోయిన బాధ నాకు తెలుసు

హరి సైకో అన్న వార్తలను ఆయన ఖండించాడు. చిన్నప్పటి నుంచి ఎవరితో గొడవపడ్డ చరిత్ర లేదని స్పష్టం చేశాడు. ఎవరి ప్రోద్బలంతోనే జరిగింది.. ఎవరో చేయించారని ఆరోపించాడు. అనుకోకుండా మాత్రమే జరిగిందని హరి చెప్పాడని తెలిపాడు. నా కొడుకు చేసింది తప్పే అని అన్నాడు. ఈ విషయం తెలియగానే పోలీసులకు అప్పగిస్తానని చెప్పా.. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పానని అన్నాడు. పోలీసులకు లొంగిపోమని నేనే చెప్పానని తెలిపాడు. ఒక కొడుకు చనిపోతే ఎంత బాధ ఉంటుందో మాకు తెలుసు. శంకర్‌ నాయక్‌ను చూస్తే చాలా బాధేస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News