Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentSunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Sunil | తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా సక్సెస్ అవడం అనేది చాలా అంటే చాలా అరుదు. అప్పట్లో రేలంగి, రమణారావు, రాజబాబు లాంటి దిగ్గజ హాస్య నటులకు కూడా ఇది సాధ్యం కాలేదు. 90ల్లో యమలీల తర్వాత కొన్నేళ్ల పాటు అలీ హీరోగా సినిమాలు చేశాడు కానీ.. అతడు అందుకున్న విజయాలు మాత్రం అరడజన్ కూడా లేవు. మళ్లీ ఆ తర్వాత హీరోగా ఒకటి రెండు విజయాలు అందుకున్న కమెడియన్ సునీల్.

అందాల రాముడు, పూలరంగడు, మర్యాద రామన్న లాంటి విజయాలతో సునీల్ మార్కెట్ బాగానే పెరిగింది. కానీ ఆ వచ్చిన మార్కెట్ నిలబెట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడు సునీల్. మూడు నాలుగు ఏళ్ల పాటు ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ ఇచ్చాడు. దాంతో హీరోగా ఈయన మార్కెట్ ఎంత వేగంగా పెరిగిందో.. అంతకంటే వేగంగా పతనం అయిపోయింది.

దాంతో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు సునీల్. ఒకప్పుడు ఆయన హీరోగా సినిమా వస్తుంది అంటే కచ్చితంగా కాస్త గుర్తింపు ఉండేది. కానీ ఈమధ్య ఊరు పేరు తెలియని సినిమాలలో కూడా సునీల్ కనిపిస్తున్నాడు. ఆయన బొమ్మను పెట్టుకొని సినిమా బిజినెస్ చేసుకుంటున్నారు కొందరు చిన్న నిర్మాతలు.

పోస్టర్లపై సునీల్ బొమ్మ కనిపించేంత వరకు తెలియదు అసలు ఈ సినిమా ఆయన ఎప్పుడు చేశాడు అని..! మార్కెట్ అంత దారుణంగా పడిపోవడంతో.. హీరోగా కాకుండా విలన్ పాత్రల వైపు ఆసక్తి చూపిస్తున్నాడు ఈ భీమవరం బుల్లోడు.
సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత కమెడియన్ కంటే ప్రతి నాయకుడు గానే రాణిస్తున్నాడు సునీల్.

ఇప్పటికే పుష్ప, కలర్ ఫోటో లాంటి సినిమాలలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో మార్కులు కొట్టేశాడు సునీల్. ప్రస్తుతం తమిళంలో రజనీకాంత్ జైలర్.. శివ కార్తికేయన్ మావీరన్ సినిమాలలో విలన్ గా నటిస్తున్నాడు. దాంతో పాటు రామ్ చరణ్ శంకర్ సినిమాలో అత్యంత కీలకపాత్రలో నటిస్తున్నాడు సునీల్. ఇవన్నీ చూస్తుంటే ఇకపై సునీల్ ను హీరోగా ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే.

ఆ మధ్య హరీష్ శంకర్ కథ అందించిన రఘుపతి వెంకయ్య సినిమా కూడా ఆదిలోనే ఆగిపోయింది. దాంతో ఎంచక్కా వచ్చిన సినిమాలన్నీ సైన్ చేసుకుంటూ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయాడు ఈ మాజీ హీరో.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ

Mrunal Thakur | అయ్యో రామా.. సీతకు ఎన్ని కష్టాలో.. ఒక హిట్టు ఇవ్వండయ్యా..!

Telugu Cinema | తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదా..?

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..

Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్‌ పోస్తా అంటూ జబర్దస్త్‌ యాంకర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

Nayanthara | నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?

Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని చంపేశారంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తండ్రి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News