Wednesday, July 24, 2024
- Advertisment -
HomeEntertainmentJunior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన...

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

Junior NTR | మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ అయిపోయాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత హాలీవుడ్‌లో కూడా చెర్రీకి ఫ్యాన్‌ పాలోయింగ్‌ బాగానే ఏర్పడింది. ఇటీవల జరిగిన హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమమే ఇందుకు నిదర్శనం. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఏకంగా ఐదు అవార్డులు అందుకుని రికార్డు సృష్టిస్తే.. ఈ హెచ్‌సీఏ అవార్డుల ప్రదానోత్సంలో ప్రజెంటర్‌గా చరణ్‌ మరో అరుదైన గౌరవం అందుకున్నాడు. దీని పట్ల తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఎంతో గర్వంగా ఫీలయ్యింది. కానీ ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రం కాస్త హర్ట్‌ అయ్యారు.

ఎన్టీఆర్‌ అభిమానులు ఎందుకు ఫీలయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా.. ఎందుకంటే.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్‌చరణ్‌ కంటే కూడా ఎన్టీఆర్‌ యాక్టింగ్‌కే విదేశీయులు ఎక్కువగా ఫిదా అయ్యారు. కొమురం భీముడో సాంగ్‌లో తారక్‌ పెట్టిన ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి ఈయన ఆస్కార్‌ అందుకోదగ్గ నటుడు అంటూ కితాబిచ్చారు. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ వెరైటీ మ్యాగజైన్‌ అయితే ఆస్కార్‌ బెస్ట్‌ యాక్టర్‌ కేటగిరీలో టాప్‌ 10 లో నామినేట్‌ చేయవచ్చని తెలిపింది. దీంతో #NTRforOscars అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా చాలారోజులు ట్రెండ్‌ అయ్యింది. అయితే ఫైనల్‌ నామినేషన్స్‌లో తారక్‌ సెలెక్ట్‌ కాలేకపోయాడు. కానీ బెస్ట్‌ యాక్టర్‌గా మాత్రం విదేశీయులు ఎన్టీఆర్‌ను గుర్తించారు. దీంతో గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్‌ ఛాయిస్ అవార్డుల సమయంలోనూ తారక్‌ పేరే ఎక్కువగా వినిపించింది. అలాంటిది హెచ్‌సీఏ మాత్రం ఎన్టీఆర్‌ను కాకుండా రామ్‌చరణ్‌ ఒక్కడినే ఈ అవార్డుల ప్రదానోత్సవానికి పిలవడంతో నందమూరి అభిమానులు కాస్త ఫీలయ్యారు. ఇదే విషయాన్ని హెచ్‌సీఏను నిలదీశారు. తారక్‌ను పిలవలేదా? ఆయన ఎందుకు రాలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ నుంచి వచ్చే ట్వీట్ల తాకిడి తట్టుకోలేక హెచ్‌సీఏ వాళ్లందరికీ వివరణ ఇచ్చింది. ఎన్టీఆర్‌ ఎందుకు అవార్డుల ప్రదానోత్సవానికి రాలేదో క్లారిటీ ఇచ్చింది.

‘ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ఇష్టపడే వాళ్లందరికీ నమస్కారం. ఈ అవార్డుల కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను కూడా పిలిచాం. కానీ ఆయన కొత్త సినిమా షూటింగ్‌ కారణంగా రాలేకపోయాడు. త్వరలోనే తనకు అవార్డు అందజేస్తాం. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అంటూ హెచ్‌సీఏ ట్వీట్‌ చేసింది. దీనిపై స్పందించిన ఓ ఫ్యాన్స్‌.. ఎన్టీఆర్‌ వాళ్ల సోదరుడు మరణించాడు.. అతను ఏ షూటింగ్‌లో పాల్గొనగడం లేదని కామెంట్‌ చేశాడు. ఈ కామెంట్‌కు కూడా హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ స్పందించింది. ‘సినిమా షూటింగ్‌ కారణంగా అవార్డుల ప్రదానోత్సవానికి రాలేకపోతున్నా అని ఎన్టీఆర్‌ మాకు చెప్పాడు.. ఆ తర్వాత వాళ్ల సోదరుడు చనిపోయాడు. దీంతో షూటింగ్‌ ఆగిపోయింది’ అంటూ మళ్లీ వివరణ ఇచ్చింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Medical Student Preethi | సైఫ్ ఒక్కడే కాదు.. ప్రీతి మరణానికి ఇదీ కారణమేనా. పీజీ వైద్య విద్యార్థిని కేసులో కొత్త ట్విస్ట్

Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ

Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News