Monday, April 15, 2024
- Advertisment -
HomeLatest NewsTriangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17...

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Triangle Love Story | తన ప్రేయసికి దగ్గరవుతున్నాడనే అక్కసుతో ప్రాణ స్నేహితుడనే చంపేసిన అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన మరువకముందే అలాంటి ఉదంతమే మరొకటి వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. దాదాపు 17 నెలల క్రితం జరిగిన ఈ హత్య వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

నా లవర్‌తోనే క్లోజ్‌గా ఉంటావా?

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్రనగర్ గ్రామ పంచాయతీకి పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి బాపట్ల రాజు, సౌతురి కార్తిక్ స్నేహితులు. అదే కాలనీకి చెందిన ఓ అమ్మాయిని బాపట్ల రాజు ఇష్టపడ్డాడు. అదే అమ్మాయితో కార్తిక్ కూడా చనువుగా మాట్లాడటం రాజు చూశాడు. ఒకటి రెండు సార్లు తను ప్రేమించిన అమ్మాయితో కార్తిక్ క్లోజ్‌గా మాట్లాడటం చూసి కోపం పెంచుకున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయికి దగ్గరవుతున్న కార్తిక్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించాడు. దీనికోసం ఒక ప్లాన్ వేశాడు.

కొట్టి చంపి.. బండరాళ్ల మధ్య పడేసి..

2021 సెప్టెంబర్ 20వ తేదీన కార్తిక్‌ను చంపేందుకు రాజు స్కెచ్ వేశాడు. వరకు సోదరుడయ్యే బొజ్జ హరీశ్ సహాయంతో దావత్ చేసుకుందామని నందిపేట శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఫుల్లుగా మందుగా, కల్లు తాగించారు. తాగిన మైకంలోనే గుట్టపైకి తీసుకెళ్లారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం గుట్ట మీదకు వెళ్లిన తర్వాత బండరాళ్లతో కొట్టి చంపేశారు. అనంతరం అక్కడే పెండ బండరాళ్ల మధ్యలో కార్తిక్ శవాన్ని పడేసి వచ్చేశారు. ఏమీ తెలియనట్లు ఉన్నారు. కార్తిక్ కనబడకపోవడంతో అతని కుటుంబసభ్యులకు కూడా అనుమానం రాలేదు.

నవీన్ హత్య తర్వాత వెలుగులోకి

కార్తిక్ తరచూ వివిధ ఊర్లకు వెళ్లి కూలీ పనులు చేస్తుండేవాడు. అప్పుడప్పుడు ఆంధ్రాకు వెళ్లి ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బులు సంపాదించేవాడు. దీంతో అతని కుటుంబసభ్యులు కార్తిక్ కనిపించకపోవడాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కార్తిక్ చదువుకోలేదు. అతని వద్ద ఫోన్ కూడా లేకపోవడంతో కార్తిక్‌ను కాంటాక్ట్ అవ్వలేకపోయారు. ఎప్పటిలాగే ఎక్కడో పనిచేసుకుంటూ ఉంటాడని లైట్ తీసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో నవీన్ హత్యోదంతంతం బయటకు రావడంతో మళ్లీ కార్తిక్ విషయం తెరపైకి వచ్చింది. నవీన్‌ను హరిహరకృష్ణ చంపేసిట్టే తన ప్రేయసి కోసం కార్తిక్‌ను రాజు హతమార్చాడని ప్రచారం మొదలైంది. ఈ వ్యాఖ్యలు కార్తిక్ కుటుంబం చెవిలో కూడా పడ్డాయి. పైగా కార్తిక్ కనిపించకుండా పోవడానికి ముందు రోజు రాజుతో కలిసి నందిపేట ఎల్లమ్మ దగ్గరకు వెళ్లాడని చూసినవాళ్లు చెప్పారు.

హత్య జరిగిన ప్లేస్‌కి వెళ్తే అస్తిపంజరమే మిగిలింది

గ్రామంలో జరుగుతున్న ప్రచారంతో కంగారుపడిన కార్తిక్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కార్తిక్ , రాజు స్నేహితులను విచారించారు. బాపట్ల రాజును తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. రాజు చెప్పిన వివరాల ఆధారంగా ఘటనాస్థలికి వెళ్లి చూడగా ఆస్తిపంజరం లభ్యమైంది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఫొరెన్సిక్ అధికారి నాగమోహన్ రావు ఆధ్వర్యంలో ఆస్తి పంజరానికి పోస్టుమార్టం నిర్వహించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ

Mrunal Thakur | అయ్యో రామా.. సీతకు ఎన్ని కష్టాలో.. ఒక హిట్టు ఇవ్వండయ్యా..!

Telugu Cinema | తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదా..?

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..

Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్‌ పోస్తా అంటూ జబర్దస్త్‌ యాంకర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News