Manchu Manoj | ఎట్టకేలకు మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలకు తెర పడింది. శుక్రవారం రాత్రి భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో కుటుంబసభ్యులు కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక నిర్వహించారు. మూడు రోజులుగా మంచు లక్ష్మీ నివాసం వద్ద సందడి కనిపించినప్పటికీ ఎంటనేది సీక్రెట్‌గా ఉంచారు. చివరకు మంచు మనోజ్ పెళ్లి తర్వాత అసలు విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఫొటోల్లో మనోజ్, మౌనిక జంట పెళ్లి బట్టల్లో మెరిసిపోయింది. బంగారు వర్ణం పట్టు కుర్తా, దోతిలో మనోజ్ కనిపించగా.. ఆకుపచ్చ, గులాబీ వర్ణం పట్టుచీరలో మౌనిక ఎంతో అందంగా కనిపించింది.
ఈ పెళ్లి కి వైఎస్ విజయమ్మ, భూమా అఖిల ప్రియ, శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి, సింగర్ సునీత, వెన్నెల కిషోర్, దర్శకుడు బాబీ తదితరులు హాజరయ్యారు.
2015లో మంచు మనోజ్ ప్రణతి ని ప్రేమించి పెళ్లి చేసుకోగా వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ కూడా 2019లో విడాకులు తీసుకున్నారు. మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహామే కావడం గమనార్హం.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!
Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?