Home Latest News Isle of Man Record | 10 పరుగులకే ఆలౌట్.. అంతర్జాతీయ మ్యాచ్లో చెత్త రికార్డు..

Isle of Man Record | 10 పరుగులకే ఆలౌట్.. అంతర్జాతీయ మ్యాచ్లో చెత్త రికార్డు..

Isle of Man Record | టైమ్ 2 న్యూస్, డగ్లస్: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యల్ప స్కోరు నమోదైంది. ఫోర్లు, సిక్సర్లకు పెట్టింది పేరైన పొట్టి ఫార్మాట్లో.. ఓ జట్టు 10 పరుగులకే ఆలౌటైంది. 8.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఆ టీమ్ పట్టుమని పది పరుగులు చేసి పది వికెట్లు కోల్పోయింది. ఇక లక్ష్యఛేదనకు దిగిన జట్టు.. రెండు బంతుల్లోనే 13 పరుగులు చేసి విజయం ఖాయం చేసుకుంది. ఇదంతా ఏదో గల్లి మ్యాచ్లో జరిగితే పెద్దగా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు కానీ.. అంతర్జాతీయ మ్యాచ్ కావడంతోనే దీనిపై అభిమానుల దృష్టి పడింది.

స్పెయిన్, ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్ల మధ్య జరిగిన పోరు ఈ చెత్త రికార్డుకు వేదికైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు.. 8.4 ఓవర్లలో కేవలం 10 పరుగులే చేసి ఆలౌటైంది. జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోగా.. ఆరుగురు ఆటగాళ్లు డకౌటయ్యారు. ఇన్నింగ్స్ మొత్తం ఒక్క బౌండ్రీ కూడా నమోదు కాలేదు. 4 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. స్పెయిన్ బౌలర్లలో కమ్రాన్, అతీఫ్ మెహమూద్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన స్పెయిన్ జట్టు.. కేవలం రెండు బంతుల్లోనే ఆట పూర్తి చేసింది. తొలి బంతి నోబాల్ కాగా.. ఆ తర్వాత వేసిన రెండు బంతులను స్పెయన్ ఓపెనర్ అవైస్ అహ్మద్ భారీ సిక్సర్లు బాదాడు. దీంతో స్పెయిన్ రెండు బంతుల్లో 13 పరుగులు చేసి చారిత్రక విజయం అందుకుంది. పురుషుల టీ20 క్రికెట్లో ఇప్పటి వరకు అతితక్కువ పరుగుల రికార్డు బిగ్బాష్ లీగ్ సిడ్నీ థండర్స్ (15 పరుగులు) పేరిట ఉండగా.. తాజాగా దాన్ని ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు తిరగరాసింది.

ఈ మ్యాచ్తో మూడు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. పురుషుల పొట్టి క్రికెట్లో ఇదే అత్యల్ప స్కోరు కాగా.. లక్ష్యఛేదనలో వేగవంతమైన రన్రేట్తో పాటు.. బంతుల పరంగా (118 బంతులు మిగిలుండగా) అతి పెద్ద విజయం ఈ మ్యాచ్లోనే నమోదయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఆరు మ్యాచ్ల సిరీస్లో ఇది చివరిది. సిరీస్ను స్పెయిన్ 5-0తో గెలుచుకోగా, రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version