Home Latest News Tim Southee | ధోనినే దాటేసిన కివీస్ క్రికెటర్ టిమ్ సౌథీ

Tim Southee | ధోనినే దాటేసిన కివీస్ క్రికెటర్ టిమ్ సౌథీ

Tim Southee | న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్ టిమ్ సౌథీ.. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీని దాటేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ధోనీ కంటే ఎక్కువ సిక్స్‌లు బాదాడు. తన కెరీర్‌లో ధోనీ 78 సిక్స్‌‌లు కొట్టాడు. అయితే ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో చెలరేగి ఆడిన టిమ్ సౌథీ.. 82 సిక్స్‌లతో ధోనీని అధిగమించాడు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టీమ్ సౌథీ చెలరేగి ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో మిగతా ఆటగాళ్లు అంతా తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరిన క్రమంలో ఇంగ్లండ్‌ ముందు దూకుడు చూపించాడు. కేవలం 49 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో వేగంగా 73 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో చేసిన సిక్స్‌లతో ధోనీని దాటేశాడు. మొత్తంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో సౌథీ 11వ స్థానంలో ఉన్నాడు. ధోనీని మాత్రామే కాదు క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (69), టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ (68), భారత మాజీ సారథి కపిల్ దేవ్‌ (61)ను కూడా సౌథీ దాటేశాడు.

టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో స్టోక్స్ ఇప్పటివరకు 109 సిక్స్‌లు బాదాడు. బ్రెండన్ మెక్ కల్లమ్ (107), ఆడమ్ గిల్ క్రిష్ (100), క్రిస్ గేల్ (98), జాక్వలిన్ కలిస్ (97) టాప్ 5 జాబితాలో ఉన్నారు. ఇక భారత్ తరఫున మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (91) టాప్ లో ఉన్నాడు. 78 సిక్స్‌లతో ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు.

తొలి కివీస్ క్రికెటర్

ఇంగ్లండ్ జట్టుపై తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ పడగొట్టిన టీమ్‌ సౌథీ.. అన్ని ఫార్మాట్లలో కలిపి 700 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. డానియల్ వెటోరి 696 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా సౌథీ 15వ స్థానంలో ఉన్నాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ (1,347) వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మురళీధరన్‌ రికార్డు బద్దలు కొట్టడం దాదాపుగా ఎవరి వాళ్ళ కాకపోవచ్చు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version