Home Sports GG vs DC | షఫాలీ పరుగుల సునామీ.. డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌పై ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

GG vs DC | షఫాలీ పరుగుల సునామీ.. డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌పై ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

GG vs DC | టైమ్ 2 న్యూస్, ముంబై: భారత యువ ఓపెనర్ షఫాలీ వర్మ విధ్వంసం సృష్టించడంతో మహిళల ప్రీమియర్ లీగ్ ( డబ్ల్యూపీఎల్‌ )లో ఢిలీ క్యాపిటల్స్ మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. కిమ్ గార్త్ (32 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. హర్లీన్ (20), జార్జియా (22) పర్వాలేదనిపించారు. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (0) డకౌట్ కాగా.. లార్ వాల్వర్ట్ (1), ఆష్లే గార్డ్నర్ (0), దయాలన్ హేమలత (5), సుష్మ వర్మ (2) విఫలమయ్యారు. మూనీ గాయం కారణంగా డబ్లూ్యపీఎల్కు దూరమవడంతో గుజరాత్ జట్టుకు సారథ్యం వహిస్తున్న భారత యువ ఆల్రౌండర్ స్నేహ్ రాణా (2) పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో కాప్ (5/15), శిఖ పాండే (3/26) రాణించారు.

బాదుడే బాదుడు..

స్వల్ప లక్ష్యచేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 7.1 ఓవర్లలో 107 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. యువ ఓపెనర్ షఫాలీ వర్మ (28 బంతుల్లో 76 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. బౌలర్‌తో సంబంధం లేకుండా దంచుడే పరమావధిగా పెట్టుకున్న షఫాలీ గుజరాత్ బౌలింగ్ను ఊచకోత కోసింది. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ చూస్తుండగానే లక్ష్యాన్ని కరిగించేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (21 నాటౌట్)ను నాన్ స్ట్రయికర్ ఎండ్‌కు పరిమితం చేస్తూ షఫాలీ విధ్వంసం సృష్టించింది. బంతి ఎక్కడేసినా దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన షఫాలీ.. తనను లేడీ సెహ్వాగ్ ఎందుకంటారో మరోసారి నిరూపించింది. 10 ఫోర్లు, 5 సిక్సర్లతో గుజరాత్ బౌలర్లకు నిద్రలేకుండా చేసింది.

ఢిల్లీ మూడో విజయం..

గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిన ఢిల్లీ.. వెంటనే పుంజుకుంది. బీసీసీఐ తొలి సారి నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచ్‌లోనూ నెగ్గి 6 పాయింట్లతో టేబుల్ టాపర్గా కొనసాగుతుండగా.. ఢిల్లీ నాలుగు మ్యాచ్ల్లో మూడింట నెగ్గి 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక గుజరాత్ జెయింట్స్‌కు లీగ్‌లో ఇది మూడో పరాజయం. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టు రెండు పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక స్టార్ ఓపెనర్ స్మృతి మంధన నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడి అట్టడుగున ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version