Monday, March 27, 2023
- Advertisment -
HomeNewsInternationalZelensky on Putin | పుతిన్‌ ఇంకా బతికే ఉన్నాడా… రష్యా అధ్యక్షుడిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు...

Zelensky on Putin | పుతిన్‌ ఇంకా బతికే ఉన్నాడా… రష్యా అధ్యక్షుడిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు

Zelensky on Putin | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇంకా బతికే ఉన్నారో లేదో తనకు ఇంకా కచ్చితంగా తెలియదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అన్నారు. ఆ దేశానికి.. ప్రభుత్వానికి సంబంధించి ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారో లేక వేరే ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదని జెలెన్‌ స్కీ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సందర్బంగా నిర్వహించిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో జెలెన్‌ స్కీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రష్యాతో శాంతియుత చర్చలు ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ఆయన్ని మీడియా ప్రశ్నలు వేసింది. దానికి ఆయన బదులిస్తూ… తాను ఎవరితో, దేని గురించి మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు. అసలు రష్యా అధ్యక్షుడు అందుకు సరైన వ్యక్తా కాదా అనే విషయం తనకు ఖచ్చితంగా తెలియదన్నారు. అసలు ఆయన బతికే ఉన్నారా? నిర్ణయాలు ఆయనే తీసుకుంటున్నారా? లేదా ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? తాము ఎవరితో శాంతి చర్చలు జరుపాలి? అన్నది తనకు అర్థం కావడం లేదన్నారు.

జెలెన్‌ స్కీపై రష్యా తీవ్ర ఆగ్రహం

యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్‌ బహిరంగంగా కనిపించకపోవడంతో పాటు డిసెంబర్‌లో జరగాల్సిన వార్షిక ప్రెస్‌ మీట్‌ను కూడా రద్దు చేశారు. దీంతో పుతిన్ సజీవంగా ఉన్నారా లేదా అన్న విషయంపై జెలెన్‌స్కీ అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై రష్యా తీవ్ర స్థాయిలో మండిపడింది. పుతిన్‌ అంటే ఉక్రెయిన్‌తోపాటు జెలెన్‌స్కీ భయం పట్టుకుందని, వారికి ఆయనే సమస్య అన్నది దీంతో స్పష్టమైందని రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. రష్యా.. పుతిన్‌ ఉనికిలో ఉండకూడదని జెలెన్‌స్కీ భావిస్తున్నారని ఆయన అన్నారు. జెలెన్ స్కీ మానసికస్థితికి ఇది అద్దం పడుతోందన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | గోల్డెన్‌ వీసా అందుకున్న అల్లు అర్జున్‌.. యూఏఈ ఇచ్చే ఈ వీసా ఎందుకంత స్పెషల్‌?

Google | షాక్ ఇచ్చిన సెర్చింజిన్‌ సంస్థ..12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Breaking News | పడవ మునిగి 145 మంది జలసమాధి.. ఓవర్‌లోడ్ వల్లే ప్రమాదం !

Quelea Birds | బుల్లి పిట్టలపై కెన్యా యుద్ధం.. ఆరు లక్షల పక్షులను చంపడమే టార్గెట్‌

Amritsar-Singapore flight | ప్యాసింజర్స్‌ని మర్చిపోయిన సింగపూర్‌ విమానం.. అమృత్‌సర్‌ విమానాశ్రయంలో ఘటన!

Vijay Antony | బిచ్చగాడు హీరో పరిస్థితి విషమం అంటూ వార్తలు.. క్లారిటీ ఇదీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News