Sunday, April 14, 2024
- Advertisment -
HomeEntertainmentAllu Arjun | గోల్డెన్‌ వీసా అందుకున్న అల్లు అర్జున్‌.. యూఏఈ ఇచ్చే ఈ వీసా...

Allu Arjun | గోల్డెన్‌ వీసా అందుకున్న అల్లు అర్జున్‌.. యూఏఈ ఇచ్చే ఈ వీసా ఎందుకంత స్పెషల్‌?

Allu Arjun | పుష్ప సినిమా తర్వాత నేషనల్‌ వైడ్‌ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్‌ వీసా ( golden visa )ను అందుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బన్నీ తన ఆనందాన్ని పంచుకున్నాడు.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి గోల్డెన్‌ వీసా పొందిన వాళ్లలో అల్లు అర్జున్‌ ఫస్ట్‌ ఏం కాదు. ఇంతకుముందు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల, కాజల్‌ అగర్వాల్‌ కూడా ఈ గోల్డెన్‌ వీసాను అందుకున్నారు. ఇంతకీ గోల్డెన్‌ వీసాను అంత ప్రత్యేకంగా ఎందుకు చూస్తారు? అది పొందడం నిజంగా అరుదైన అవకాశమేనా? ఇప్పుడు చూద్దాం..

గోల్డెన్‌ వీసా స్పెషాలిటీ ఏంటి?

ఎలాంటి ఆంక్షలు లేకుండా సుదీర్ఘకాలం యూఏఈలో నివసించేందుకు ఈ గోల్డెన్‌ వీసాలు ఇస్తుంటారు. విదేశీయులను ఆకర్షించే ఉద్దేశంతోనే యూఏఈ 2019లో వీటిని తీసుకొచ్చింది. 5 లేదా 10 సంవత్సరాల కాలపరిమితితో ఈ గోల్డెన్‌ వీసాలు ఇస్తారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వీటిని రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. వాటంతట అవే రెన్యువల్‌ అవుతాయి. ఈ వీసా పొందినవాళ్లు అబుదాబీ, దుబాయ్‌తో పాటు యూఏఈలోని అన్ని సిటీల్లో పదేళ్ల వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఉండొచ్చు. అలాగే 100 శాతం ఓనర్‌షిప్‌తో సొంతంగా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు.

ఎవరికి ఇస్తారు?

గోల్డెన్‌ వీసాలను అందరికీ ఇవ్వరు. ఏదైనా విభాగంలో విశేష సేవలు అందించిన వాళ్లకే వీటిని ఇస్తుంటారు. పెట్టుబడుదారులు, వ్యవస్థాపకులు, సాహిత్యం, కల్చర్‌, ఎడ్యుకేషన్‌, హెరిటేజ్‌ ( వారసత్వ సంపద ) గురించి అధ్యయనం చేసిన వాళ్లకు వీటిని ఇస్తుంటారు.

అల్లు అర్జున్‌ కంటే గోల్డెన్‌ వీసా పొందిన సినీ ప్రముఖులు వీళ్లే..

భారతీయ సినీ ప్రముఖుల్లో బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ తొలిసారిగా గోల్డెన్‌ వీసా అందుకున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్‌ నటులు సంజయ్‌ దత్‌, సునీల్‌ శెట్టి, మౌనీ రాయ్‌, ఫరా ఖాన్‌, బోనీ కపూర్‌ ఫ్యామిలీ, నేహా కక్కర్‌, సింగర్‌ సోనూ నిగమ్‌ వీటిని పొందారు. సౌత్‌ ఇండస్ట్రీకి వస్తే త్రిష, అమలాపాల్‌, మోహన్‌ లాల్‌, మమ్ముట్టీ, టివోనో థామస్‌, దుల్కర్‌ సల్మాన్‌, ఉపాసన, కాజల్‌, విక్రమ్‌, మీనా, విజయ్‌ సేతుపతి కూడా గోల్డెన్‌ వీసా అందుకున్నారు. టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి ఈ అరుదైన గౌరవం అందుకుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | కొండగట్టు అంజన్న మీద పవన్‌ కళ్యాణ్‌కి అంత సెంటిమెంట్‌ ఎందుకు ? వారాహికి అక్కడే పూజలు చేయడానికి కారణమేంటి ?

Andhra Pradesh | ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్.. జీవో నంబర్ 1పై జోక్యం చేసుకోలేమన్న అత్యున్నత న్యాయస్థానం

Trisha | విజయ్ ఇంటికి సమీపంలో కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొన్న త్రిష

covid19 | కరోనా సోకిన వాళ్లు 18 నెలల వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేదంటే ప్రాణాలకే ముప్పు

Shubra Aiyappa | 150 ఏళ్ల కిందటి ఇంట్లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News