Thursday, April 25, 2024
- Advertisment -
HomeNewsInternationalQuelea Birds | బుల్లి పిట్టలపై కెన్యా యుద్ధం.. ఆరు లక్షల పక్షులను చంపడమే టార్గెట్‌

Quelea Birds | బుల్లి పిట్టలపై కెన్యా యుద్ధం.. ఆరు లక్షల పక్షులను చంపడమే టార్గెట్‌

Quelea Birds | గుప్పెడంత కూడా ఉండని బుల్లి పిట్టలపై కెన్యా దేశం పగబట్టింది. ఎర్రటి ముక్కుతో ముద్దు ముద్దుగా కనిపించే పక్షుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేందుకు కంకణం కట్టుకుంది. పది, ఇరవై కాదు ఏకంగా ఆరు లక్షల బుల్లి పిట్టలను చంపేయాలని కెన్యా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చూడగానే అబ్బుర పరిచే వేలడంత పక్షుల్ని చంపాలన్న కఠిన నిర్ణయానికి ఎందుకొచ్చింది. వాటిపై కెన్యాకు ఎందుకంత పగ? అని అనుకుంటున్నారా?

నిజానికి అది ఆ బుల్లి పిట్టలపై కోపం కాదు.. భయం.. ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఒకప్పుడు కరవు తాండవించింది. పంటలు పండకపోవడంతో ఆహారం దొరక్క ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ దారుణ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పంటలు కూడా పండుతున్నాయి. ఇలాంటి సమయంలో క్యులియా అనే చిన్న సైజు పక్షులు క్యూబా దేశాన్ని గడగడలాడిస్తున్నాయి. చూడ్డానికి 5 అంగుళాలు కూడా ఉండని ఈ పక్షులు భయాందోళనకు గురిచేస్తున్నాయి.

కెన్యాలో గోధుమ, బార్లీ, బియ్యం, పొద్దుతిరుగుడు పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. ఈ పంటలు చేతికొచ్చే సమయంలో క్యులియా పక్షులు వాటిపై వాలి నాశనం చేస్తున్నాయి. పంట గింజలను తినేస్తున్నాయి. దీనివల్ల వందలాది టన్నుల ఆహారం ధాన్యం నాశనమైపోతుంది. దీనిపై అటు రైతులు, ఇటు ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. ఇదే కొనసాగితే ఆహార ధాన్యాల కొరతతో మళ్లీ కరవును ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయపడిపోతున్నారు. అందుకే లక్షల సంఖ్యలో ఉన్న క్యులియా పక్షులపై కెన్యా యుద్ధం ప్రకటించింది. వెంటనే ఆరు లక్షల పక్షులను చంపేయాలని నిర్ణయం తీసుకుంది

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Amritsar-Singapore flight | ప్యాసింజర్స్‌ని మర్చిపోయిన సింగపూర్‌ విమానం.. అమృత్‌సర్‌ విమానాశ్రయంలో ఘటన!

DCW chief Swati Maliwal | ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కే రక్షణ లేదు.. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి?

Usain Bolt | రూ. 100 కోట్లు పోగొట్టుకున్న పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్.. అకౌంట్‌లోని నుంచి సొమ్మంతా ఖాళీ

New Zealand PM | న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ అనూహ్య నిర్ణయం.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News