Friday, April 26, 2024
- Advertisment -
HomeNewsInternationalAmritsar-Singapore flight | ప్యాసింజర్స్‌ని మర్చిపోయిన సింగపూర్‌ విమానం.. అమృత్‌సర్‌ విమానాశ్రయంలో ఘటన!

Amritsar-Singapore flight | ప్యాసింజర్స్‌ని మర్చిపోయిన సింగపూర్‌ విమానం.. అమృత్‌సర్‌ విమానాశ్రయంలో ఘటన!

Amritsar-Singapore flight | టైం2న్యూస్‌, అమృత్‌సర్‌: పంజాబ్‌ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన 35 మంది ప్రయాణికులను మర్చిపోయి వెళ్లిపోయింది సింగపూర్‌ విమానం. ప్రయాణికులు షెడ్యూల్‌ టైమ్‌కే వచ్చారు. లాంజ్‌లో వేచి ఉన్నారు. ఎంత సేపు వేచి చూస్తున్నా విమానాశ్రయ సిబ్బంది ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. చివరికి విసిగిపోయిన ప్రయాణికులు సిబ్బందిని గట్టిగా నిలదీయడంతో వారు చెప్పిన సమాధానం విని ఖంగుతినడం ప్రయాణికుల వంతు అయ్యింది.

ఈ ఘటన పంజాబ్ లోని అమృత్‌సర్ ఎయిర్‌ పోర్టులో చోటు చేసుకుంది. రాత్రి ఏడున్నర గంటలకు రావాల్సిన విమానం మధ్యాహ్నం 3 గంటలకే సింగపూర్ వెళ్లిపోయిందని సిబ్బంది వెల్లడించారు. ఈ విషయం గురించి గట్టిగా నిలదీయడంతో ” టైమింగ్‌ మారిన విషయాన్ని మీకు మెయిల్ చేశాం… చూసుకోకపోవడం మీ తప్పు. అంతేకానీ ఇక్కడికి వచ్చి ప్రశ్నిస్తే ఎలా ” అంటూ ఎదురు దాడికి దిగారు. దీంతో దిక్కుతోచని స్థితిలో 35 మంది ప్రయాణికులు ఏమి చేయలేక అక్కడే ఉండిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… సింగపూర్‌కు చెందిన స్కూట్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం అసలు టైమ్‌ ప్రకారం సాయంత్రం 7 గంటలకు అమృత్‌ సర్‌ నుంచి విమానం టేకాఫ్‌ అవ్వాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకే అమృత్‌ సర్‌ నుంచి వెళ్లిపోయింది. దీంతో సింగపూర్‌కు టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు నివ్వెర పోయారు. కాగా విమాన సమయంలో జరిగిన మార్పుల గురించి ప్రయాణికులకు తాము ముందుగానే తెలియజేశామని.. ఈ- మెయిల్ సందేశం ఇచ్చామని అధికారులు వెల్లడించారు. గతేడాది డిసెంబర్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. ఢిల్లీకి వెళ్తున్న గో ఫస్ట్‌ ఫైట్‌ విమానం 50 మంది ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే వదిలి వెళ్లిపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hockey World Cup | హాకీ ప్రపంచకప్‌లో వేల్స్‌పై భారత్‌ ఘన విజయం.. క్వార్టర్స్‌ చేరాలంటే క్రాస్‌ ఓవర్‌ తప్పనిసరి.

Usain Bolt | రూ. 100 కోట్లు పోగొట్టుకున్న పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్.. అకౌంట్‌లోని నుంచి సొమ్మంతా ఖాళీ

New Zealand PM | న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ అనూహ్య నిర్ణయం.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన

Microsoft Layoffs | ఉద్యోగులకు భారీ షాక్ ఇవ్వబోతున్న మైక్రోసాఫ్ట్.. 11 వేల మంది ఉద్యోగులపై వేటు!

Nepal Plane Crash | నేపాల్‌లో కూలిన విమానం యజమాని కూడా ఇలాగే.. హెలికాప్టర్‌ ప్రమాదంలో!

Top 30 Influencers | అరుదైన ఘనత సొంతం చేసుకున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News