Sunday, March 26, 2023
- Advertisment -
HomeLatest NewsWrestlers Protest | డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి నుంచి ప్రాణహాని ఉందన్న యువ రెజ్లర్లు.. కమిటీ ఏర్పాటు...

Wrestlers Protest | డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి నుంచి ప్రాణహాని ఉందన్న యువ రెజ్లర్లు.. కమిటీ ఏర్పాటు చేసిన భారత ఒలింపిక్‌ సంఘం

Wrestlers Protest | డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిష్‌ భూషన్‌ నుంచి తమకు ప్రాణహాని ఉందని యువ రెజ్లర్లు ఆరోపించారు. ఆయన్ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేశారు. భారత ఒలింపిక్‌ సంఘాన్ని ( IOA ) ఆశ్రయించిన యువ రెజ్లర్లు.. లైంగిక వేధింపులపై తక్షణమే విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

కాగా, మహిళా రెజ్లర్‌లను ఎన్నో సంవత్సరాల నుంచి డబ్ల్యూఎఫ్‌ఐ ప్రెసిడెంట్ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని స్టార్‌ రెజ్లర్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఒలంపిక్‌ విజేత వినేష్‌ ఫోగట్‌ ఆరోపించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆయన తీరును నిరసిస్తూ దేశ రాజధాని జంతర్‌ మంతర్‌ వద్ద అనేక మంది మహిళా రెజ్లర్లు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే.

యువ రెజ్లర్ల ఆందోళనకు పురుష రెజ్లర్లు మద్దతు పలుకుతున్నారు. ఐఓఏ ప్రెసిడెంట్‌ పీటీ ఉషకు రాసిన లేఖలో బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ చేతిలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వివరించారు. తమతో పాటు ఇతర సహోద్యోగులు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు తమకు తెలిపారని రెజ్లర్లు లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ లేఖ పై టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేతలు రవి దహియా, బజరంగ్‌ పునియా సహా ఐదుగురు రెజ్లర్లు సంతకం చేశారు.

వీరితో పాటుగా రియో గేమ్స్‌ కాంస్య విజేత సాక్షి మాలిక్‌, ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ పతక విజేతలు వినేష్‌ ఫోగట్‌, దీపక్‌ పునియాలు కూడా సంతకం చేశారు. డబ్ల్యూఎఫ్‌ఐని రద్దు చేయాలని, దాని అధ్యక్షుడిని తొలగించాలని రెజ్లర్లు పునరుద్ఘాటించారు. ఆయనను తొలగించకపోతే ఎంతో మంది యువ రెజ్లర్ల భవిష్యత్తు అర్థాంతరంగా ముగిసిపోతుందని, అందరికీ ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జాతీయ సమాఖ్య వ్యవహారాలను నిర్వహించడానికి రెజ్లర్లతో సంప్రదించి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, యువ రెజర్ల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మేరీకోమ్‌, యోగశ్వర్‌ దత్‌లతో కూడిన కమిటీ బ్రిష్‌ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టనుంది. ఈ కమిటీలో మేరికోమ్‌, యోగేశ్వర్‌ దత్‌తో పాటు ఆర్చర్‌ దోలా బెనర్జీ, ఇండియన్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు సహ్‌దేవ్‌ యాదవ్‌ కూడా ఉన్నారు. ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు పీటీ ఉషా, అభినవ్‌ బింద్రా, యోగేశ్వర్‌తో కూడిన ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ అత్యవసరంగా సమావేశమై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News