Home Latest News KCR | వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతాం.. ఖమ్మం సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌

KCR | వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతాం.. ఖమ్మం సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌

KCR | దేశంలో రాబోయేది విపక్షాల ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో మోదీ ఇంటికే పరిమితమవుతారని అన్నారు. ఖమ్మం సభ దేశంలో రాబోయే మార్పునకు సంకేతమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ వేదికగా బీజేపీని గద్దె దించుతామని శపథం చేశారు‌. దేశంలో అద్భుతమైన పంటలు పండే అవకాశం ఉన్నా.. ఇంకా ఆహార ఉత్పత్తుల్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రపంచ బ్యాంకును అప్పు అడగకుండా.. ఏ అమెరికా కాళ్లను మొక్కకుండా బతికే వనరులు దేశంలో మనకున్నాయని తెలిపారు. సంపద ఉండి కూడా మనం ఎందుకు భిచ్చమెత్తుకుంటున్నామని అన్నారు. ఈ సభ దేశంలో రాబోయే మార్పునకు సంకేతమని స్పష్టం చేశారు. ప్రగతి సూచికలో విద్యుత్ రంగం అత్యంత కీలకమైందని.. అది కచ్చితంగా పబ్లిక్ సెక్టార్‌ లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌ పాలసీ అదేనని స్పష్టం చేశారు.

దేశంలో లక్షల కోట్ల ఆస్తి ఉంది..

కరెంటు కార్మికులారా? పిడికిలి బిగించండి.. విద్యుత్‌ ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుదామని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా దళితబంధును దేశ వ్యాప్తంగా అమలు చేయాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని.. దేశంలో లక్షల కోట్ల కోట్ల ఆస్తి ఉందని, ఇదంతా ఏమైతుందని ప్రశ్నించారు.

విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వం

బీజేపీ ప్రభుత్వ తెలివిలేని పోకడల వల్ల దేశం మరింత వెనుకబాటుకు గురవుతోందని విమర్శించారు. తెలంగాణ మోడల్‌ దేశమంతా అమలు చేస్తామన్నారు కేసీఆర్. నష్టాలు సమాజానికి.. లాభాలు ప్రైవేట్ వ్యక్తులకా? అని ప్రశ్నించారు. ఎల్‌ఐసీని అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని.. ఏజెంట్లు, ఉద్యోగులు తమ పార్టీని బలపరచాలన్నారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమని తెలిపారు. మోదీ అమ్మితే తాము అధికారంలోకి వచ్చాక కొంటామని హామీ ఇచ్చారు. లొడలొడ మాట్లాడే ప్రధానికి మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదా? అని విమర్శించారు. మేక్ ఇన్‌ ఇండియా.. జోక్‌ ఇన్‌ ఇండియాగా మారిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే అగ్నిపథ్‌ ను రద్దు చేస్తామని ప్రకటించారు.

150 మేధావులు బీఆర్‌ఎస్‌ విధానాలను రూపొందిస్తున్నారు

కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ విధానాలు ప్రజల ముందుంచుతామని తెలిపారు కేసీఆర్. 150 మంది మేధావులు బీఆర్ఎస్ విధానాలు రూపొందిస్తున్నారని అన్నారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు బీఆర్ఎస్ పుట్టిందని.. దేశ ప్రజలను కష్టాల నుండి విముక్తి చేస్తామని చెప్పారు. దేశంలో బీఆర్ఎస్ లాంటి పార్టీ అధికారంలో ఉంటే రెండేళ్లలో వెలుగు జిలుగులు జిమ్మే భారత్ తయ్యారు అయ్యేదని చెప్పారు. ఖమ్మం చరిత్రలో ఇంత పెద్ద సభ ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IT Rides | హైదరాబాద్‌లో మరోసారి ఐటీ రైడ్స్.. ఈసారి రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లపై!

CM KCR | బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే దేశమంతా ఇవి అమలు చేస్తాం.. సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన

CM KCR | ఖమ్మం ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరాల జల్లులు

CM KCR | ఖమ్మంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం.. బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన

Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్‌పై కేరళ సీఎం ప్రశంసలు

Akhilesh Yadav | మోడీ సర్కార్‌ ఎవరిని బతకనివ్వడం లేదు.. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం : అఖిలేశ్‌ యాదవ్‌!

D Raja | దేశానికి బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన ముప్పుగా మారాయి.. ఖమ్మం సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా

Exit mobile version