Home Latest News Akhilesh Yadav | మోడీ సర్కార్‌ ఎవరిని బతకనివ్వడం లేదు.. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ...

Akhilesh Yadav | మోడీ సర్కార్‌ ఎవరిని బతకనివ్వడం లేదు.. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం : అఖిలేశ్‌ యాదవ్‌!

Akhilesh Yadav | బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో పాల్గొన్న యూపీ మాజీ సీఎం, సమాజ్‌ వాది పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే మొదలు కావాలని ఆయన పిలుపినిచ్చారు. దేశంలో ఉన్న విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని ఆరోపిపంచారు.

అసలు దేశంలో మోదీ సర్కార్‌ ఎవరిని బతకనివ్వడం లేదన్నారు. అందుకే బీజేపీ కి భయపడి దేశాన్నే వదిలి పారిపోతున్నారని ఆయన ఆరోపించారు.

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుని పెట్టుబడులు పెట్టే వారిపై బీజేపీ బెదిరింపులకు దిగుతోందని అఖిలేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి పతనం ఖాయమైందని పేర్కొన్నారు.

కేంద్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలు బీజేపీకి తొత్తులుగా మారిపోయాయని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికలకు కేవలం 400 రోజులు మాత్రమే ఉన్నాయని మోదీ స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైందని.. అందుకే అందుకే బీజేపీ ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకుంటోందని..

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలన్నింటినీ పడగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుందని.. ఆఖరికి జీ 20 సదస్సు అధ్యక్ష పదవిని కూడా బీజేపీ తన రాజకీయ ప్రచారాలకు వాడుకుంటోందన్నారు. దేశాన్ని ప్రతి విషయంలోనూ వెనక్కి తీసుకుని వెళ్తోందన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

D Raja | దేశానికి బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన ముప్పుగా మారాయి.. ఖమ్మం సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా

Bandi Sanjay | పిల్లలను రాజకీయాల్లోకి లాగుతావా.. నీకు దమ్ముంటే నాతో రాజకీయం చెయ్.. కేసీఆర్‌‌కు బండి సవాల్.. తన కొడుకుపై కేసు పెట్టడంపై ఆగ్రహం

America Mega Million Jackpot | అన్‌ లక్కీడే రోజే జాక్‌పాట్‌.. లాటరీలో రూ.10వేల కోట్లు గెలుచుకున్నాడు..

New Corona Variant | అత్యంత ప్రమాదకారిగా కరోనా సూపర్ సబ్ వేరియంట్.. అమెరికాలో వైరస్ వ్యాప్తికి కారణమిదే.. భారత్‌లోనూ 26 కేసులు

Uppal Match | హోంగ్రౌండ్‌లో బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌.. గల్లీబాయ్‌కు అండగా రోహిత్‌ శర్మ

Junior NTR | యంగ్‌ టైగర్‌ని కలిసిన టీమిండియా ఆటగాళ్లు..ఎక్కడంటే

Exit mobile version