Wedding Card Viral | ఈ మధ్య కాలంలో పెళ్లిల్లో చాలా వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలే పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకే పందిట్లో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న సంఘటనలు చాలా అరుదు. ఇప్పుడు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరుగుతున్న పెళ్లికి సంబంధించిన పెళ్లి శుభలేఖ నెట్టింట వైరల్‌గా మారింది. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇంటర్‌లోనే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి.. ఇరు కుటుంబాల్లో ఒప్పించి ఒకే వేదికపై పెళ్లికి రెడీ అయిపోయాడు.
ఈ పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. పెళ్లి పత్రికలు కూడా పంచేశారు. మార్చి 9న గురువారం (ఇవాళ ) మధ్యాహ్నం పెళ్లి చేసుకోబోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలంలోని ఎర్రబోరు గ్రామానికి చెందిన మడివి ముత్తయ్య, రామలక్ష్మి దంపతుల కుమారుడు సత్తిబాబు ఒకేసారి ఇద్దరిని పెళ్లాడబోతున్నాడు. ఈ మేరకు వెడ్డింగ్ కార్డులో వివరాలు పేర్కొన్నారు. కుర్నపల్లి గ్రామానికి చెందిన ఇర్ప సత్యనారాయణ, రుక్మిణి దంపుతుల కుమార్తె సునీతలను సత్తిబాబు పెళ్లాడనున్నట్లు ఆహ్వాన పత్రికలో ఉంది. ఒకే వ్యక్తి ఇద్దరిని ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకుంటుండటంతో ఇది వైరల్‌గా మారింది.

ఇందులో మరో విశేషం కూడా ఉంది. ఇద్దరు అమ్మాయిలను ప్రేమించిన సత్తిబాబు ఒకే వేదికలో ఇద్దరినీ పెళ్లి చేసుకోనున్నాడు. బంధువులు, కుటుంబసభ్యులందరి సమక్షంలో గ్రాండ్‌గా వీరి వివాహం జరుగనుంది.అసలేం జరిగిందంటే.. సత్తిబాబు ఇంటర్ చదువుతున్నప్పుడు పక్క గ్రామానికి చెందిన స్వప్న కుమారి అనే యువతిని ప్రేమించాడు. అదే క్రమంలో వరుసకు మరదలైన సునీతను కూడా ఇష్టపడ్డాడు. గత మూడేళ్ల నుంచి ఇద్దరితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే స్వప్నకి పాప జన్మించగా.. సునీతకు కూడా బాబు పుట్టాడు. దీంతో అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని సత్తిబాబును కోరారు.
దీంతో సత్తిబాబు ఇద్దరినీ ప్రేమిస్తున్నానని.. ఇద్దరినీ పెళ్లి చేసుకుంటాని చెప్పాడు. దీంతో షాక్ అయిన గ్రామస్థులు.. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి వాళ్ల ఇష్ట ప్రకారమే పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇద్దరితో ఒకే ముహూర్తానికి పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కూడా అచ్చు వేయించారు. దీంతో మన సత్తి బాబు ఇద్దరు పెళ్లాల ముద్దల మొగుడు కాబోతున్నాడని నెట్టింట కామెంట్లు వస్తున్నాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!
Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో తెలుసా?
Viral News | బైక్ మీద వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 40 లక్షలు చోరీ చేసిన దొంగలు!
H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్ 3 ఎన్ 2 ఇన్ ఫ్లూ ఎంజా.. లక్షణాలివేనా ?