Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsInternationalBill Gates Drives Auto | ఆటో నడిపిన బిల్ గేట్స్.. రియాక్షన్‌ ఇచ్చిన ఆనంద్...

Bill Gates Drives Auto | ఆటో నడిపిన బిల్ గేట్స్.. రియాక్షన్‌ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఏంటా ఆటో స్పెషల్‌?

Bill Gates Drives Auto | మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కొద్ది రోజుల క్రితం భారత పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి కిచిడి చేసి సందడి చేశారు. తాజాగా ఆయన ఆటో నడుపుతూ హల్‌ చల్ చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర స్వయంగా ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

అంతేకాకుండా.. ఆయన బిల్‌ గేట్స్ వీడియోకి తన రియాక్షన్ కూడా ఇచ్చారు. భారత పర్యటనలో భాగంగా బిల్‌ గేట్స్‌ .. ఆనంద్‌ మహీంద్రాతో కూడా భేటీ అయ్యారు. గేట్స్‌తో ఉన్న చిత్రాన్ని ట్విటర్‌ లో పంచుకున్నారు ఆనంద్‌ మహీంద్రా. అంతేకాకుండా తామిద్దరూ హర్వర్డ్ యూనివర్సిటీలో క్లాస్ మేట్స్ అని చెప్పారు. ఇప్పుడు బిల్ గేట్స్ తాను మహీంద్రా ట్రియోను నడుపుతున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఆటో ప్రత్యేకతలివే..

బిల్‌ గేట్స్‌ నడిపిన ఈవీ ఆటో రిక్షా మహీంద్రా కంపెనీది. ఇది 131 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీంట్లో నలుగురు ప్రయాణించవచ్చు. ఈ ఆటో రిక్షను చూసి గేట్స్ ఫిదా అయ్యారు. ” ఇన్నోవేషన్ పట్ల భారత్ అభిరుచి ఎప్పటికీ విస్మయపరచదు. నేను ఈవీ రిక్షాను నడిపాను. మహీంద్రా వంటి కంపెనీలు రవాణా పరిశ్రమను డీకార్బనైజేషన్ చేయడంలో దోహదపడడం స్ఫూర్తిదాయకంగా ఉంది” అని గేట్స్ రాశారు.

ఈ వీడియోకు ఆనంద్‌ మహీంద్ర రియాక్షన్ ఇచ్చారు. చల్తీకా నామ్ బిల్ గేట్స్ గాడీ అంటూ ఓ హిందీ పాటను ట్యూన్ చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News