Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsTraffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో...

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Traffic Challan | ట్రాఫిక్‌ చలానాలు కట్టలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా నేరడిగొమ్ము గ్రామానికి చెందిన అన్నెపాక ఎల్లయ్య, మల్లమ్మ దంపతులు బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు వలస వచ్చి ఐఎస్ సదన్ డివిజన్ నీలం రాజశేఖర్‌ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

ఎల్లయ్య హమాలీగా, మల్లమ్మ చంపాపేటలోని సాయిబాబా గుడిలో పని చేస్తున్నారు. అయితే ఎల్లయ్య బైక్‌పై పలు చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో మీర్‌చౌక్‌ పోలీసులు సీజ్‌ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య సోమవారం రాత్రి ఇంటికి వచ్చి విషం తాగి అత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే డీఆర్‌డీఓ ఒవైసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

చలాన్ల సొమ్ము రూ.10 వేలు కడితేనే బండి ఇస్తానని ట్రాఫిక్‌ ఎస్సై చెప్పాడని, కూలీ పనులు చేసుకునే తాను అంత సొమ్ము చెల్లించలేనని ఎంత బతిమాలినా వినలేదని, పైగా టార్చర్‌ పెట్టాడని సూసైడ్‌ నోట్‌లో రాశాడు. విచ్చలవిడిగా వేస్తున్న చలాన్లతో పేదలు నానా అవస్థలు పడుతున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశాడు. సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్‌ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో తెలుసా?

Kim Jong un Sister | ఆ చర్యలను యుద్ధంగా భావిస్తాం: కిమ్‌ సోదరి!

Viral News | బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 40 లక్షలు చోరీ చేసిన దొంగలు!

H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్‌ 3 ఎన్‌ 2 ఇన్‌ ఫ్లూ ఎంజా.. లక్షణాలివేనా ?

Elon Musk | మస్క్‌ బాత్ రూంకి వెళ్లాలన్న వాళ్లు ఉండాల్సిందేనట.. !

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Bill Gates Drives Auto | ఆటో నడిపిన బిల్ గేట్స్.. రియాక్షన్‌ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఏంటా ఆటో స్పెషల్‌?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News