Friday, March 31, 2023
- Advertisment -
HomeLifestyleHealthInfluenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Influenza | ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇన్ ఫ్లూ ఎంజా వైరస్ H3N2తో జ్వరాల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరికి జలుబు దగ్గు జ్వరం లక్షణాలు ఉండటం ప్రస్తుతం అందరినీ కలవరపెడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్‌ లో ఈ వైరస్ విజృంభిస్తోంది.

అక్కడి ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. దీంతో అత్యవసర వార్డులు కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా కాన్పూర్‌ నగరంలోని హల్లేట్ ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు క్యూ కట్టారు. జ్వరం, ఆగకుండా దగ్గు, ముక్కు కారడం, శ్వాసకోశ వంటి సమస్యలతో ఒక్క రోజులోనే 200 మంది ఆసుపత్రికి వచ్చారు. వీరిలో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండటంతో అక్కడి ఎమర్జెన్సీ వార్డులు కిక్కిరిసిపోవడంతో రోగులను ఇతర వార్డులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిపై ఆసుపత్రిలోని మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ అధిపతి రిచా గిరి మాట్లాడుతూ ‘సాధారణంగా ఏటా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఇలాంటి కేసులు చూస్తుంటాం.

కానీ, ఈ సారి పేషేంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారిలో ఎక్కువ మందిలో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలున్నాయి. గత 24 గంటల్లో కేవలం శ్వాసకోశ సమస్యలతోనే 24 మంది వైద్యశాలలో చేరారు. వారికి ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది వెంటిలేటర్లపై ఉన్నారు’ అని రిచా గిరి వెల్లడించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్‌ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో తెలుసా?

Kim Jong un Sister | ఆ చర్యలను యుద్ధంగా భావిస్తాం: కిమ్‌ సోదరి!

Viral News | బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 40 లక్షలు చోరీ చేసిన దొంగలు!

H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్‌ 3 ఎన్‌ 2 ఇన్‌ ఫ్లూ ఎంజా.. లక్షణాలివేనా ?

Elon Musk | మస్క్‌ బాత్ రూంకి వెళ్లాలన్న వాళ్లు ఉండాల్సిందేనట.. !

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Bill Gates Drives Auto | ఆటో నడిపిన బిల్ గేట్స్.. రియాక్షన్‌ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఏంటా ఆటో స్పెషల్‌?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News