Thursday, April 25, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowDo You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

Do You Know | మన చుట్టూ రోజు కనిపించే విషయాలైనా.. కొన్నింటి గురించి మనం అంతగా పట్టించుకోం. అలాంటిదే ఇది కూడా. మీరు వెళ్లాల్సిన రైలు కోసం రైల్వే స్టేషన్‌లో ఎదురు చూస్తున్నప్పుడు రైలు వెనుక “X” అని రాసి ఉండటాన్ని కచ్చితంగా మీరు గమనించే ఉంటారు. అన్ని రైళ్లకు అలాంటి సింబలే ఉంటుంది. మరి అలా ఎందుకు రాసి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా?

రైలు వెనుక బోగికి రాసి ఉండే ఆ సింబల్‌కి అర్థం ఏంటో తెలుసా ? తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇదో ఆ సింబల్‌ వెనుకలా అసలు కథ. ప్రతి రైలు బండి వెనుక చివరి కంపార్ట్ మెంట్ పై ఈ ‘X’ గుర్తు ఉంటుంది. ఇది సాధారణంగా పసుపు, తెలుపు రంగుల్లో కనిపిస్తుంది. కదులుతున్న రైలుకు అదే చివరి కోచ్ అని తెలిసేందుకు ఇలా X గుర్తును వేస్తారు. ఒక రైలు ఎలాంటి ప్రమాదం లేకుండా బోగీలన్నీ వెళ్లినయా లేదా అని సిబ్బంది గుర్తించేందుకు వీలుగా ఈ సూచికను వేస్తారట.

X గుర్తుతో ఉన్న బోగీ రైలు చివర లేనట్లయితే, ఆ రైలు ప్రమాదంలో ఉందని గమనించి సిబ్బంది అలర్ట్ అవుతారు. రైల్ క్రాసింగ్ అయ్యే సందర్భంలో డ్యూటీలో ఉన్న గార్డు ‘X’ మార్కును గుర్తించిన తరువాతనే రైలు బోగీలన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్థారిస్తూ ఆకుపచ్చ జెండాను చూపిస్తారు.

ఒక వేళ రైలు చివరి బోగీకి X గుర్తు లేని సమయంలో స్టేషన్ మాస్టర్ అప్రమత్తం అవుతారు. సదరు రైలు ప్రమాదంలో ఉందని గుర్తించి హెచ్చరికను జారీ చేస్తారు. సాధరణ పౌరులు సైతం ఎప్పుడైనా ప్రయాణంలో ఉన్న రైలు బోగీ చివర X గుర్తు లేనట్లయితే సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ కు వెంటనే ఫిర్యాదు చేయచ్చు.

అయితే X గుర్తుతో పాటు చివర కోచ్ వెనుకగా LV అని కూడా రాసి ఉంటుంది. దాని అర్థం “లాస్ట్ వెహికల్” అని. ఈ రెండిటితో పాటుగా ఒక చిన్న రెడ్ లైట్ కూడా కనిపిస్తుంది. ఇది రాత్రి సమయాల్లో చివరి బోగీని గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్‌ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో తెలుసా?

Viral News | బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 40 లక్షలు చోరీ చేసిన దొంగలు!

H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్‌ 3 ఎన్‌ 2 ఇన్‌ ఫ్లూ ఎంజా.. లక్షణాలివేనా ?

Bill Gates Drives Auto | ఆటో నడిపిన బిల్ గేట్స్.. రియాక్షన్‌ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఏంటా ఆటో స్పెషల్‌?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News