Sunday, April 28, 2024
- Advertisment -
HomeNewsInternationalMicrosoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య...

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Microsoft CEO Satya Nadella | సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ కొట్టాలంటే తప్పనిసరిగా కోడింగ్ వచ్చి ఉండాలి. ప్రోగ్రామింగ్‌ మీద మంచి పట్టు ఉండాలి. కానీ కోడింగ్‌ రాకున్నా సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ చేసేయొచ్చు అంటున్నారు. అలా అన్నది ఎవరో కాదు.. ప్రపంచ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదేళ్ల. అదేలా అనుకుంటున్నారా.. ఓసారి లుక్కేయండి మరి ఆయన ఏమన్నారో.

టెక్నాలజీ వినయోగం పెరిగిపోవడంతో ఇప్పుడు చాలా మంది తమకంటూ ప్రత్యేకంగా యాప్ ఉండాలనుకుంటున్నారు. అయితే యాప్‌ తయారు చేయడం ఊరికే కాదుగా. కచ్చితంగా ప్రోగ్రామింగ్‌, కోడింగ్ లాంటివి రావాల్సిందే. అయితే ఇప్పటి నుంచి కోడింగ్‌ రాకపోయినా ఫర్వలేదు యాప్స్ తయారు చేసేయోచ్చని అంటున్నారు సత్య నాదేళ్ల.

కోడింగ్ రాకపోయినప్పటికీ కూడా యాప్స్ తయారు చేసేయచ్చని భరోసా కల్పిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన చాట్ జీపీటీ ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌లో సరికొత్త ఒరవడిని సృష్టించింది. చాట్ జీపీటీని ఇన్‌ క్లూడ్ చేస్తూ ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ బింగ్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మరికొన్ని సరికొత్త టూల్స్ ని మైక్రో సాఫ్ట్ విడుదల చేయనుంది.

పవర్ ప్లాట్ ఫామ్ అనే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టూల్‌ను ఇంటిగ్రేట్ చేయనుంది. ఈ టూల్ అందుబాటులోకి వస్తే గనుక ఎలాంటి కోడింగ్ అవసరం లేకుండానే యాప్స్ తయారు చేయచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. డేటా అనాలసిస్, ఈమెయిల్‌ క్యాపింగ్, కస్టమర్ సమరీ, వీక్లీ వర్క్ రిపోర్ట్స్ వంటి వాటిని ఈ టూల్ తో చేయచ్చు. ఆఫీస్ ఆటోమేషన్ తో చేసే పనులు మొత్తాన్ని ఈ టూల్ సాయంతో చేయచ్చని తెలిపారు.

ఈ పవర్ ప్లాట్ ఫామ్ టూల్ మాత్రమే కాదు.. ఏఐ బిల్డర్ పేరిట మరో కొత్త టూల్ ని కూడా తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ టూల్ సాయంతో వర్క్ ఫ్లో ఆటోమేషన్ చేయోచ్చని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు తెలిపారు. తమ బిజినెస్ మేనేజ్మెంట్ కోసం కంపెనీ ప్రారంభించిన డైనమిక్ 365 కోపిలాట్ కు ఈ ఏఐని అనుసంధానం చేశారు.

అంతేకాకుండా మార్చి 16న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఓ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రీఇన్వెంటింగ్ ప్రొడక్టవిటీ విత్ ఏఐ అనే అంశంపై సత్య నాదెళ్ల చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలోనే సత్య నాదెళ్ల పలు కీలక అంశాలు వెల్లడించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్‌ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో తెలుసా?

Kim Jong un Sister | ఆ చర్యలను యుద్ధంగా భావిస్తాం: కిమ్‌ సోదరి!

Viral News | బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 40 లక్షలు చోరీ చేసిన దొంగలు!

H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్‌ 3 ఎన్‌ 2 ఇన్‌ ఫ్లూ ఎంజా.. లక్షణాలివేనా ?

Elon Musk | మస్క్‌ బాత్ రూంకి వెళ్లాలన్న వాళ్లు ఉండాల్సిందేనట.. !

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Bill Gates Drives Auto | ఆటో నడిపిన బిల్ గేట్స్.. రియాక్షన్‌ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఏంటా ఆటో స్పెషల్‌?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News