Friday, March 31, 2023
- Advertisment -
HomeNewsInternationalsputnik v covid 19 vaccine | కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసిన శాస్త్రవేత్త హత్య.....

sputnik v covid 19 vaccine | కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసిన శాస్త్రవేత్త హత్య.. ఎలా చంపారంటే!

sputnik v covid 19 vaccine | రష్యన్‌ శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్‌ తన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ V ను అభివృద్ధి చేయడంలో వైరాలజిస్ట్‌ ఆండ్రీ బోటికోవ్‌ కూడా ఒకరుగా ఉన్నారు. ఈ నెల 2న ఆయన తన అపార్ట్‌ మెంట్‌ లో శవమై కనిపించారు. ఆండ్రీ ఇంట్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. డబ్బు విషయంలో గొడవకు దిగి బెల్డుతో గొంతు బిగించి హత్య చేసినట్లు సమాచారం.

నిందితుడిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఆయన రష్యాలో చాలా పేరున్న శాస్త్రవేత్త. ఆయన వ్యాక్సిన్‌ గురించి చేసిన కృషికి గానూ..” ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ఫర్‌ ఫాదర్‌ ల్యాండ్‌” లాంటి ప్రతిష్టాత్మక అవార్డును కూడా అందుకున్నారు. 2020 లో స్పుత్నిక్‌ V వ్యాక్సిన్‌ ను అభివృద్ధి చేసిన 18 మందిలో ఆండ్రీ ఒకరు. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీలో సీనియర్ పరిశోధకుడిగా పనిచేశారు.

గతంలో డీఐ ఇవనోవ్‌స్కీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి సంబంధించిన రష్యన్ స్టేట్ కలెక్షన్ ఆఫ్ వైరస్‌లో సీనియర్ శాస్త్రవేత్తగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మ్యాథమెటిక్స్‌లో సీనియర్ పరిశోధకుడిగా పనిచేశారు. ఆండ్రీ బోటికోవ్ మృతిపై విచారణ కొనసాగుతోందని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది.

బోటికోవ్ మృతదేహాన్ని గుర్తించిన కొద్ది గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు తెలిపింది. నిందితుడికి నేర చరిత్ర ఉందని.. గతంలో జైలు శిక్ష కూడా అనుభవించాడని పేర్కొంది. నిందితుడిని కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు దర్యాప్తు బృందం యోచిస్తోంది. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సైంటిస్ట్ బోటికోవ్‌ను దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది.

ఈ హత్య ఘటనను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఖండించాయి. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Manchu Manoj | సైలెంట్‌గా మంచు మనోజ్‌, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్‌

Saif Ali Khan | మీడియాపై సైఫ్‌ అలీ ఖాన్ అసహనం‌.. ఇంకెందుకు లేటు.. మా బెడ్ రూమ్‌లోకి రండి అంటూ ఆగ్రహం!

Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News