Home Latest News Accident | స్కూల్‌ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు… 15 మంది విద్యార్థులకు...

Accident | స్కూల్‌ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు… 15 మంది విద్యార్థులకు గాయాలు!

Accident | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్‌ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించిన వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.

గాయపడిన విద్యార్థులందరికీ మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజ్ఙాన్ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ బస్సు మంగళవారం ఉదయం అల్మాస్ పూర్‌, రాజన్నపేట విద్యార్థులను ఎక్కించుకొని తిరిగి సిరిసిల్లకు వస్తుంది. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపేట సెకండ్‌ బైపాస్‌ కార్నర్‌ వద్ద మూలమలుపు ఉంది. అయితే అదే సమయంలో స్కూల్‌ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు బస్సు కుదుపులకుగురైంది. విద్యార్థులు ఒకరిపై మరొకరు పడ్డారు. మరి కొంత మంది బస్సులో కడ్డీలకు, సీట్లకు తగలడంతో 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలబారిన పడ్డ విద్యార్థులు నొప్పికి తట్టుకోలేక ఆర్తనాదాలు చేశారు.

విషయం తెలిసిన వెంటనే స్కూల్‌ యజమాని ఎండీ లతీఫ్‌ ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను స్ధానిక అశ్విని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికి విద్యార్థులు అందరూ క్షేమంగానే ఉన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Hindenburg Report | హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ

mobiles on plane | విమానం ఎక్కగానే మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేయమని ఎందుకు చెబుతారు?

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version