Home Lifestyle Do you know Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?

Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?

Legal Advice | శేఖర్ ఐశ్వర్యవంతుడు. అతని పేరు మీద బోలెడన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి నానా రభసా చేసేవాడు. ఇది చూసి భార్య సౌజన్యకు విసుగొచ్చింది. ఇలా తాగుడు తందనాలకు డబ్బులు తగిలిస్తే రేపు బిడ్డల భవిష్యత్తు ఏం కావాలని గొడవ పెట్టుకుంది. రోజూ ఇదే తంతు కావడంతో చిరాకుతో శేఖర్‌ ఎక్కడికో వెళ్లిపోయాడు. ఏళ్లు గడిచాయి. పిల్లలు పెరిగి పెద్దయ్యారు. కానీ శేఖర్‌ తిరిగి రాలేదు. ఇప్పుడు బిడ్డ పెళ్లి చేద్దామంటే డబ్బులేదు. భూమి అమ్మి అయినా బిడ్డను ఓ అయ్యకు అప్పజెప్దామంటే.. జాగలన్నీ శేఖర్‌ పేరు మీదనే ఉన్నయ్‌.. శేఖర్‌ ఆచూకీ ఏమో లేదు. ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటి? శేఖర్‌ పేరు మీద ఉన్న భూమిని సౌజన్య అమ్మడానికి కుదురుతుందా? దీనికి న్యాయనిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

కుటుంబసభ్యుల్లో ఎవరైనా కనిపించకుండా వెళ్తే వెంటనే అతని పేరు మీద ఉన్న ఆస్తిని ఇతరులు మార్పిడి చేసుకోవడం కుదరదు. దీనికోసం ముందుగా వ్యక్తి అదృశ్యమైనట్టు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసినప్పటి నుంచి ఏడేళ్ల లోపు సదరు వ్యక్తి తిరిగి రాకపోతే అతని పేరు మీద ఉన్న ఆస్తిని వారసులు తమ పేరు మీదకు మార్చుకోవడానికి సాధ్యపడుతుంది. సివిల్‌ డెత్‌ చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి అదృశ్యమైనప్పటి నుంచి ఏడేళ్ల వరకు తిరిగి రాకుంటే అతను మరణించినట్టుగా నిర్ధారిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తిని భార్య లేదా పిల్లలు తమ పేరు మీదకు మార్చుకునేందుకు అంగీకరిస్తుంది. ఒకవేళ ఎఫ్‌ఐఆర్‌ కాపీ లేకపోతే ఆస్తి మార్పిడి కోసం కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయస్థానం ఇరుగుపొరుగు నుంచి కావాల్సిన వివరాలు సేకరించి అర్జిదారులు ఆస్తిని తమ పేరు మీదకు మార్చుకునేందుకు అర్హులా? కాదా ? అనేది నిర్ణయిస్తుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More:

Weather Effect | పంజా విసురుతున్న చలి.. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Breaking News | గుండెపోటుతో చిన్నకొడుకు.. శ్మశానానికి తరలిస్తుండగా పెద్దకొడుకు.. గంట వ్యవధిలో ఇద్దరు మృతి.. మెట్‌పల్లిలో విషాదం

Salt | ఉప్పు అప్పుగా ఇస్తే గొడవలు వస్తాయా?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Saturday | శనివారం ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే వస్తుంది

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే

Exit mobile version