Home Business Hindenburg Report | హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ

Hindenburg Report | హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ

Hindenburg Report | హిండెన్‌బర్గ్ దెబ్బకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ టాప్ 10 జాబితాలో గౌతమ్ అదానీ చోటు కోల్పోయారు. అదానీ గ్రూపు కంపెనీల షేర్లు వరుసగా మూడో రోజు భారీగా పతనం కావడంతో అదానీ సంపద 34 బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది. దీంతో మొన్నటి వరకు 119 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు 84.4 బిలియన్ డాలర్లతో 11వ స్థానానికి పడిపోయారు.

అదానీ తర్వాత ఇప్పుడు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 82.2 బిలియన్ డాలర్లతో కొనసాగుతున్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చీ ప్రభావంతో భారతీయ మార్కెట్లలో భయం నెలకొంది. దీంతో ఇవాళ అదానీ టోటల్ గ్యాస్ షేరు 10 శాతం, అదానీ విల్మర్ 5 శాతం, అదానీ పవర్ లిమిటెడ్ 4.9 శాతం పతనం అయ్యాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా 0.6 శాతం విలువ కోల్పోయింది. ఓవరాల్‌గా నాలుగు ట్రేడింగ్ సెషన్లను పరిశీలిస్తే అదానీ టోటల్ గ్యాస్ విలువ 45 శాతం, గ్రీన్ ఎనర్జీ 38 శాతం, అదానీ టోటల్ ట్రాన్సమిషన్ 36.9 శాతం, అదానీ పోర్ట్స్ 19.5 శాతం, అదానీ విల్మర్ 18 శాతం, అదానీ పవర్ 18.5 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ 13 శాతం నష్టపోయాయి.

Hindenburg ఉద్దేశమేంది..

కంపెనీల్లో జరిగే ఫ్రాడ్స్‌, దుర్వినియోగం, సీక్రెట్‌ వ్యవహారాలు, ఇతర మోసాలను గుర్తించి నివేదికలు విడుదల చేస్తోంది హిండెన్‌బర్గ్. అంతే కాకుండా ఆ కంపెనీని మెయిన్‌ టార్గెట్‌‌గా .. షార్ట్‌ సెల్లింగ్‌ చేసి సవాల్‌ విసురుతోంది. స్టాక్‌ మార్కెట్లో రకరకాల ట్రేడింగ్‌ లు ఉంటాయి. మొదట షేర్లను కొనుగోలు చేసి ధర పెరిగిన తరువాత అమ్మడం వంటివి చేస్తుంటారు. దీనిని ఇంట్రాడే, డెలివరీ అని రెండు విధాలుగా చేయవచ్చు. అయితే షేర్లు ఎక్కువ ధర వద్ద విక్రయించి.. పతనమయ్యాక అంటే ధర తగ్గిన తర్వాత కొని ట్రేడింగ్‌ ను ముగించి లాభాలు సొమ్ము చేసుకోవచ్చు. దీన్నే షార్ట్‌ సెల్లింగ్‌ అంటారు. అంటే ఏదైనా స్టాక్‌ పడిపోతుందని భావిస్తే… అప్పడు ఈ షార్ట్‌ సెల్లింగ్‌ చేయొచ్చు. అలాంటి సమయంలో ఎక్కువ ధరలకు అమ్మేసి షేరు విలువ పడిపోయాక తిరిగి కొని ట్రేడింగ్‌ చేసుకోవచ్చు.ఈ హిండెన్‌ బర్గ్ కూడా అదే చేస్తోంది.

ముఖ్యంగా ఇలాంటి రిపోర్ట్‌ లు ఇచ్చే ముందు మొదట ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. అప్పుడూ ఎలాగూ స్టాక్‌ ధర పడిపోతుందని తెలుసో ? లేదా పడిపోయేలా చేయడమో చేసి లాభాలు గడిస్తుంటుంది. అదానీ గ్రూప్‌‌పై హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్‌ విడుదల చేసే ముందు కూడా అందులో ఇన్వెస్ట్‌ చేసి కోట్లు దండుకొని ఉండొచ్చని తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

mobiles on plane | విమానం ఎక్కగానే మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేయమని ఎందుకు చెబుతారు?

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version