Home News AP YS Jagan | విశాఖ నుంచే పరిపాలన.. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కన్ఫార్మ్ చేసిన ఏపీ...

YS Jagan | విశాఖ నుంచే పరిపాలన.. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కన్ఫార్మ్ చేసిన ఏపీ సీఎం జగన్

YS Jagan | మూడు రాజధానుల అంశంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతుందని వెల్లడించారు. ఢిల్లీలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహక సమావేశాల్లో పాల్గొన్న జగన్.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. రానున్న రోజుల్లో తాను వైజాగ్‌కు షిఫ్ట్ అవుతున్నానని తెలిపారు. రాజధాని కాబోయే విశాఖకు అందరూ రావాలని.. అక్కడే పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను కోరారు. ప్రభుత్వం తరఫున పెట్టుబడులు పెట్టే వారికి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ప్రపంచ వేదిక మీద ఏపీని నిలబెట్టడానికి మీ సహకారం అవసరమని అన్నారు.

ఏపీకి మూడు రాజధానులు చేయాలని జగన్ ప్రభుత్వం మొదట్నుంచి ప్రయత్నిస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల కోర్టు తీర్పుల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఉగాది నుంచి అక్కడి నుంచే పాలన కొనసాగుతుందని మంత్రులు కూడా పేర్కొంటున్నారు. సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యల వల్ల అతి త్వరలో విశాఖకు రాజధాని మారుతుందని తెలుస్తోంది.

మార్చి మొదటి వారంలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌ మీట్‌ విశాఖ పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. ఈ మీట్‌కి వచ్చిన ఇన్వెస్టర్లందరికీ కూడా విశాఖ ప్రాంతాలను చూపి పెట్టుబడులకు అనువైన ప్రాంతం విశాఖనే అని వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు జగన్‌ మాటలను బట్టి పరిశీలిస్తే ఫిబ్రవరి ఆఖరుకే విశాఖ రాజధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా మూడు రాజధానుల అంశం పై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. మునుపు హైకోర్టు అమరావతే రాజధాని అని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

mobiles on plane | విమానం ఎక్కగానే మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేయమని ఎందుకు చెబుతారు?

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version