Home Lifestyle Devotional Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Temples | పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు నదులు, గుండాల్లో భక్తులు కాయిన్స్‌ వేయడం చూసే ఉంటారు కదా. అసలు అలా ఎందుకు వేస్తారని ఎప్పుడైనా డౌట్‌ వచ్చిందా. ముఖ్యంగా ఇంట్లో వాళ్లతో పుణ్యక్ష్రేతాలకు వెళ్తే కచ్చితంగా వాళ్లు రూపాయి బిళ్లో, రెండు రూపాయల బిళ్లో చేతిలో పెట్టి నీళ్లలో వేయమని చెబుతారు. అలా ఎందుకు చేస్తారో తెలుసా? దాని వెనుక పెద్ద కథే ఉంది.

ఇప్పుడంటే.. స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో రూపాయి, రెండు, ఐదు రూపాయల కాయిన్స్‌ను తయారు చేస్తున్నారు. కానీ అప్పట్లో నాణేలన్నీ.. రాగితో తయారు చేసేవారు. కాబట్టి ఆ నాణేలను నదిలోకానీ, దేవుడి గుడి ప్రాంగణంలో ఉండే గుండాల్లో వేయడం వల్ల ఆ నీరు స్వచ్ఛంగా మారేది. అప్పట్లో ఎక్కువగా నదుల్లో నీరే తాగేవారు. కాబట్టి.. రాగి నాణేలు వేస్తే.. నీరు శుభ్రమై తాగడానికి పనికొస్తుందని నమ్మేవారు. కారణం రాగికి నీటిని శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది కూడా. అందుకే అప్పట్లో ఎక్కువగా రాగి ప్లేట్లు, రాగి పాత్రలనే వాడేవారు.
ఇప్పుడు కూడా రాగి వాటర్‌ బాటిల్స్‌ ట్రెండ్‌గా మారిపోయింది. ఎవరు చూసినా రాగితో తయారు చేసిన వాటర్‌ బాటిల్స్‌ ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. వాటర్‌ ఫ్యూరిఫైర్స్‌లో కూడా రాగిని ఉపయోగిస్తున్నారు.

కానీ ఇప్పుడు తయారు చేసే స్టెయిన్‌ లెస్‌ స్టీలుతో తయారు చేసిన నాణేలను నీళ్లలో వేస్తే నష్టాలే ఎక్కువ. ఎందుకంటే.. నీటిలో ఎక్కువ సేపు ఆ కాయిన్స్‌ ఉంటే తుప్పుపట్టిపోతాయి. ఆ నీళ్లు తాగడం ద్వారా ఆరోగ్యం పాడవుతుంది. ఇక నుంచి మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు రాగి నాణేలు కాకుండా ఇప్పుడున్న స్టెయిన్‌ లెస్‌ స్టీలు కాయిన్స్‌ను మాత్రం నీళ్లలో వేయకండి. ఇలా వేయడం వల్ల పర్యావరణానికి హాని చేసినవారవుతారని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Lord Shiva | సోమ‌వారం శివుడిని ఎందుకు పూజిస్తారు?

Exit mobile version