Home Business Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల...

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Hindenburg Nathan Anderson

Hindenburg Research | గౌతమ్‌ అదానీ… ప్రపంచ కుబేరుల్లో ఒకరు. కానీ గత కొద్ది రోజులుగా అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ దారుణంగా పతనమవుతున్నాయి. దీంతో అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ కేవలం రెండు ట్రేడింగ్‌ సెషన్లలో ఏకంగా రూ.4 లక్షల కోట్లు పతనమైంది. అంతేకాకుండా అదానీ సంపద కూడా 20 బిలియన్‌ డాలర్లకు పైగా పడిపోయి.. ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానం నుంచి ఏడో స్థానానికి అదాని పడిపోయాడు. దీనికి అంతటికీ కారణం ఒకే ఒక్కడు… అతనే హిండెన్‌ బర్గ్‌.

అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌ బర్గ్‌ సంచలన రిపోర్ట్‌ తో అదానీ సంపద ఆవిరైంది. భారత స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలాయి. అదానీ గ్రూప్… భారత స్టాక్‌ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్‌‌లో మోసాలు చేస్తోందని ఆరోపించింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా పరిశోధనలు జరిపి పెద్ద రిపోర్ట్‌నే ప్రచురించింది. అంతేకాకుండా అదానీకి 88 ప్రశ్నలు సంధించింది. అంతే.. ఆ దెబ్బకి అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ రెండు రోజులుకే కుప్పకూలిపోయాయి. షేరు విలువ దారుణంగా పడిపోయింది. రానున్న రోజుల్లో కూడా ఇది కొనసాగే అవకాశాలున్నాయి.

అసలేంటి హిండెన్‌బర్గ్..

రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ.10 లక్షల కోట్ల నష్టానికి కారణం హిండెన్ బర్గ్ రీసెర్చి సంస్థ ఇచ్చిన నివేదిక. దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా హిండెన్ బర్గ్‌ మీద పడింది. దీని వెనకున్నది ఎవరు ? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీన్ని నడిపించేది 38 ఏళ్ల కుర్రాడు అని తెలిసి ప్రపంచమే షాక్ అయింది.. ఇతడే ఒక్క రిపోర్ట్‌తో వణుకుపుట్టించాడు. ఈ రీసెర్చ్‌ ఫర్మ్‌ అమెరికా న్యూయార్క్‌ కేంద్రంగా పని చేస్తోంది. నాథన్‌ అండర్సన్‌ అనే వ్యక్తి దీనిని 2017లో మొదలుపెట్టాడు. మ్యాన్‌ మేడ్‌ డిజాస్టర్లను వెలికితీయడమే దీని పని. ఫైనాన్షియల్‌ ఫోరెన్సిక్‌ రీసెర్చ్‌ సేవలను అందిస్తోంది.

ఈ సంస్థ ఉద్దేశమేంది..

కంపెనీల్లో జరిగే ఫ్రాడ్స్‌, దుర్వినియోగం, సీక్రెట్‌ వ్యవహారాలు, ఇతర మోసాలను గుర్తించి నివేదికలు విడుదల చేస్తోంది హిండెన్‌బర్గ్. అంతే కాకుండా ఆ కంపెనీని మెయిన్‌ టార్గెట్‌‌గా .. షార్ట్‌ సెల్లింగ్‌ చేసి సవాల్‌ విసురుతోంది. స్టాక్‌ మార్కెట్లో రకరకాల ట్రేడింగ్‌ లు ఉంటాయి. మొదట షేర్లను కొనుగోలు చేసి ధర పెరిగిన తరువాత అమ్మడం వంటివి చేస్తుంటారు. దీనిని ఇంట్రాడే, డెలివరీ అని రెండు విధాలుగా చేయవచ్చు. అయితే షేర్లు ఎక్కువ ధర వద్ద విక్రయించి.. పతనమయ్యాక అంటే ధర తగ్గిన తర్వాత కొని ట్రేడింగ్‌ ను ముగించి లాభాలు సొమ్ము చేసుకోవచ్చు. దీన్నే షార్ట్‌ సెల్లింగ్‌ అంటారు. అంటే ఏదైనా స్టాక్‌ పడిపోతుందని భావిస్తే… అప్పడు ఈ షార్ట్‌ సెల్లింగ్‌ చేయొచ్చు. అలాంటి సమయంలో ఎక్కువ ధరలకు అమ్మేసి షేరు విలువ పడిపోయాక తిరిగి కొని ట్రేడింగ్‌ చేసుకోవచ్చు.

ఈ హిండెన్‌ బర్గ్ కూడా అదే చేస్తోంది. ముఖ్యంగా ఇలాంటి రిపోర్ట్‌ లు ఇచ్చే ముందు మొదట ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. అప్పుడూ ఎలాగూ స్టాక్‌ ధర పడిపోతుందని తెలుసో ? లేదా పడిపోయేలా చేయడమో చేసి లాభాలు గడిస్తుంటుంది. అదానీ గ్రూప్‌‌పై హిండెన్‌ బర్గ్‌ రిపోర్ట్‌ విడుదల చేసే ముందు కూడా అందులో ఇన్వెస్ట్‌ చేసి కోట్లు దండుకొని ఉండొచ్చని తెలుస్తోంది.

ఈ హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు నాథన్‌ అండర్సన్‌ గురించి ఎలాంటి వివరాలు బయటికి రావు.. తెలియవు కూడా. యూనివర్సిటీ ఆఫ్‌ కనెక్టివిటీ నుంచి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ పట్టా పొందాడు. ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు అంబులెన్స్‌ డ్రైవర్‌ గా పని చేశాడు. తరువాత అమెరికాలోని ఒక డేటా కంపెనీలో ఫ్యాక్ట్‌సెట్‌ రీసెర్చ్‌ సిస్టమ్స్‌ కంపెనీలో తర్వాత అమెరికాలోని ఒక డేటా కంపెనీలో ఫ్యాక్ట్‌సెట్ రీసెర్చ్ సిస్టమ్స్ కంపెనీలో పనిచేశాడు.

టార్గెట్ చేశాడా.. ఇక అంతే..

ఎక్కడ పనిచేసినా.. ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన పనే చేశాడు. ఎలాంటి ఒత్తిడిలోనైనా పనిచేయడం ఎలానో నేర్చుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తర్వాత హిండెన్‌బర్గ్‌ను స్థాపించి పలు కంపెనీల గుట్టు విప్పుతున్నాడు.

ఏదైనా కంపెనీని లక్ష్యంగా చేసుకుంటే.. మొదట 6 నెలలు.. పబ్లిక్ రికార్డ్స్, ఇంటర్నల్ కార్పొరేట్ డాక్యుమెంట్స్‌ను పరిశీలించాక.. ఆ కంపెనీలో పనిచేసే, అంతకుముందు పనిచేసిన ఉద్యోగులతో మాట్లాడి, దేశవిదేశాలు తిరిగి సమాచారం సేకరిస్తుంటుంది. ఇక షార్ట్ సెల్లింగ్ పొజిషన్ తీసుకొని ఒక్కసారిగా రిపోర్ట్ వదిలి.. లాభాలను సొంతం చేసుకుంటుంది.

16 కంపెనీలపై రీసెర్చ్..

2020లో కూడా అమెరికాలోని నికోలా కార్పొరేషన్‌ హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ ఇలానే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ కంపెనీలోని మోసాలు బయటపడడంతో కంపెనీ స్టాక్‌ విలువ ఒక్కసారిగా 40 శాతం పతనమైంది. ఇలా ఇప్పటి వరకూ మొత్తం 16 కంపెనీల్లో ఇలా పరిశోధనలు చేసింది.

అదే పేరెందుకు ?

జర్మనీకి చెందిన ఒక పాసింజెర్‌ ఎయిర్‌ షిప్‌ పేరు హిండెన్‌ బర్గ్‌. 1937లో ఇది ప్రమాదానికి గురైంది. ఈ విపత్తులో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మానవుడి తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది కాబట్టి… తన కంపెనీకి ఆ పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు నాథన్‌ అండర్సన్‌.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

mobiles on plane | విమానం ఎక్కగానే మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేయమని ఎందుకు చెబుతారు?

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version