Home Latest News Droupadi Murmu | ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా ఇండియా తయారైంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu | ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా ఇండియా తయారైంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu | ప్రపంచ దేశాలన్ని కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఇంతకు ముందు భారత్ ప్రపంచ దేశాల పై ఆధారపడేదని కానీ ఇప్పుడు ఆ దేశాలు అన్ని కూడా భారత్ మీద ఆధారపడ్డాయని ఆమె వ్యాఖ్యానించారు. మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆమె మోడీ సర్కారు చేపట్టిన అనేక విజయాలను ప్రస్తావించారు.

ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా ఇండియా తయారైందని, ఈ దేశం మునుపెన్నడూ లేనంతగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తుందని ఆమె చెప్పారు. పేదరికమే లేని నవభారతాని నిర్మాణం కోసం కృష్టి జరుగుతోందని, ఫసల్‌ బీమా యోజన, జల్‌ జీవన్, కిసాన్‌ కార్డ్‌ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఆత్మ నిర్భర్ నినాద స్ఫూర్తితో సాయుధ దళాలకు అవసరమైన ఆయుధాలను మనమే తయారు చేసుకుంటున్నామని, సైన్యంలో మహిళలకు కూడా ఎన్నో అవకాశాలు కల్పించామని ఆమె పేర్కొన్నారు.

పేదలకు ఇళ్లు, వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి జరుగుతున్న కృషిని ఆమె వివరించారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలు ప్రారంభించామని, గిరిజనుల అభ్యున్నతి కోసం మోడీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. బేటీ పడావ్‌, బేటీ బచావ్ నినాద స్ఫూర్తితో స్కూళ్లలో బాలికల విద్యను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోందని పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ తగ్గించేలా అనేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తొలిసారిగా బిర్సా ముండా జయంతి ఉత్సవాలు జరిపాం.. తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం.. మూడు కోట్ల మందికి సొంత ఇళ్లు నిర్మించాం.. మహిళా సాధికారతను మరింతగా ప్రోత్సాహిస్తున్నామని ద్రౌపది పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rishabh Pant | క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్‌.. పంత్ సర్జరీ సక్సెస్‌!

Hindenburg Report | హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ

Nitin Gadkari | 15 ఏళ్లు దాటిన ఆ వాహనాలన్నీ ఇక తుక్కే.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి

Adani Group | మీ మోసంతో జాతీయవాదానికి పోలికా? అదానీ గ్రూపులో అవకతవకలపై మండిపడ్డ హిండెన్‌బర్గ్

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Exit mobile version