Home Entertainment Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Rajinikanth | తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ఆయన పేరు, చిత్రాలను ఏ వాణిజ్య ప్రకటనల్లో అయినా అనుమతి లేకుండా ఉపయోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని రజనీ తరుఫు న్యాయవాది తెలియజేశారు. ఈ మేరకు రజనీ తరుఫు లాయర్‌ సుబ్బయ్య పబ్లిక్‌ నోటీసులు జారీ చేశారు.

కొన్ని దశాబ్దాల నుంచి రజనీ అనేక భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అలాంటి వ్యక్తి ప్రతిష్ఠకు లేదా వ్యక్తిత్వానికి ఏదైనా నష్టం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు.

కొన్ని సామాజిక మాధ్యమాలతో పాటు కంపెనీలు.. రజినీ పేరుతో పాటు ఆయన గొంతును, ఫోటోలతో పాటు ఇమేజ్‌ ని కూడా ఉపయోగిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. కొన్ని కంపెనీలు తమ ప్రొడక్ట్‌లను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు, జనాలను ప్రలోభపెట్టేందుకు వీటిని ఉపయోగిస్తున్నట్లు గుర్తించామన్నారు.

ఇక నుంచి ఎవరైనా వ్యక్తిగత, వ్యాపార అవసరాలు సహా ఎందులో అయినా సరే అనుమతి లేకుండా రజనీకాంత్ ఫొటోలు, పేరును వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Odisha Health Minister | ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య శాఖ మంత్రి మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా సీఎం

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Australian Open | సంచలనం సృష్టించిన నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం

mobiles on plane | విమానం ఎక్కగానే మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేయమని ఎందుకు చెబుతారు?

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version