Home Latest News Rishabh Pant | క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్‌.. పంత్ సర్జరీ సక్సెస్‌!

Rishabh Pant | క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్‌.. పంత్ సర్జరీ సక్సెస్‌!

Image Source: @RishabhPant17 twitter

Rishabh Pant | ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ముంబయిలోని కోకిలా బెన్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న రిషబ్‌ పంత్‌ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధికారులు పంత్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఇటీవల పంత్‌కు చేసిన మోకాలి శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు వెల్లడించారు.

పంత్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు బీసీసీఐ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

”రిషబ్‌ క్రమంగా కోలుకుంటున్నాడు. మొదటి సర్జరీ విజయవంతమైనట్లు వైద్యుల బృందం తెలిపింది. అభిమానులందరూ తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఇది. ఈ వారంలోనే అతడు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేయనున్నాడు. మార్చిలో మరో సర్జరీ అవసరం కావచ్చు. అది ఎప్పుడు నిర్వహించాలన్నది కూడా వైద్యులు నిర్ణయిస్తారు. త్వరలోనే అతడు పూర్తి రికవరీతో మైదానంలోకి వస్తాడు’ అని ఆశిస్తున్నామని బీసీసీఐ అధికారులు తెలిపారు.

పంత్‌ పూర్తిగా గ్రౌండ్‌లోకి రావడానికి 7 నుంచి 8 నెలలు పట్టొచ్చని వివరించారు. గతేడాది చివరిలో ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు పంత్‌ కారు డివైడర్‌ని ఢీ కొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ప్రమాదంలో పంత్‌ తల, కాలు, వీపు పై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఉత్తరాఖండ్‌ లోని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం కోకిలాబెన్‌ ఆస్పత్రిలో చేర్చారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rishab Pant | రిషబ్‌ పంత్‌ సర్జరీ సక్సెస్‌.. తొందరలోనే డిశ్చార్జి.. కానీ అదొక్కటే సమస్య

Novak Djokovic | జొకో జైత్రయాత్ర.. 22వ గ్రాండ్‌స్లామ్‌తో అగ్రస్థానానికి చేరిన సెర్బియా వీరుడు

India Vs New Zealand | ఉత్కంఠ పోరులో రెండో టీ20లో కివీస్‌పై భారత్ విజయం.. సిరీస్‌పై ఆశలు

India Vs New Zealand | రెండో టీ20లో చేతులెత్తేసిన న్యూజిలాండ్.. భారత్ విజయ లక్ష్యం 100 పరుగులే

Australian Open | సంచలనం సృష్టించిన నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం

Australian Open 2023 | ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సరికొత్త ఛాంపియన్‌గా సబలెంకా!

Exit mobile version