Home Latest News Adani Group | మీ మోసంతో జాతీయవాదానికి పోలికా? అదానీ గ్రూపులో అవకతవకలపై మండిపడ్డ హిండెన్‌బర్గ్

Adani Group | మీ మోసంతో జాతీయవాదానికి పోలికా? అదానీ గ్రూపులో అవకతవకలపై మండిపడ్డ హిండెన్‌బర్గ్

Adani Group | తన షేర్ల విషయంలో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. భారతీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ క్రమంలో అదానీ గ్రూప్ ఖండించింది.

హిండెన్ బర్గ్‌ నివేదిక అంతా అబద్దాలతో కూడుకున్నదని అదానీ గ్రూప్ పేర్కొంది. ఈ ఆరోపణలు తమ కంపెనీపై చేసే దాడి మాత్రమే కాదని.. ఇండియా ప్రతిష్టను మంట కలపడానికి ఒక వ్యూహం ప్రకారం పన్నిన కుట్రే అని ఆరోపించింది. ఎంతో గొప్పదైన భారతావని ప్రతిష్టను దెబ్బ తీయడానికే ఓ విదేశీ సంస్థ నిప్పులు కక్కుతుందని ఆరోపించారు. అదానీ గ్రూప్ నివేదికపై హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ స్పందించింది. జాతీయ వాదం పేరిట జరిగే మోసాన్ని కప్పిపుచ్చలేరని వ్యాఖ్యానించింది.

అదానీ గ్రూప్‌ చేసిన చీటింగ్‌ను దేశ భక్తితో పోల్చడమేమిటని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ప్రశ్నించింది. తాము లేవనెత్తిన ఆరోపణకు సరైన సమాధానం ఇవ్వకుండా వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, మధ్యలో జాతీయ దృక్పథాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించింది. అదానీ సంపదను, ఆయన ఎదుగుదలను ఇండియా సాధించిన విజయాలతో పోలుస్తున్నారంటూ ఆరోపించింది. అంతేకాకుండా దీనితో తాము ఏకీభవించేది లేదని కూడా తేల్చిచెప్పింది.

నిజానికి భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం…. రానున్న రోజుల్లో సూపర్ పవర్‌ గా ఎదుగుతున్న దేశం… కానీ అదానీ గ్రూప్‌ లాంటి వాటి కారణంగా ఆ దేశ భవితవ్యం వెనక్కి మళ్లుతుందని భావిస్తున్నాం. భారత జాతీయ పతాకం కింద దేశాన్ని ఒక పథకం ప్రకారం దోపిడీ చేస్తున్న సంస్థ అని హిండెన్‌ బర్గ్‌ సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రపంచ కుబేరుల్లో ఉన్నవారు ఎవరు ఫ్రాడ్‌ చేసినప్పటికీ అది ఫ్రాడే అవుతుంది. తప్ప మరేమి కాదని ఆరోపించింది. హిండెన్‌ బర్గ్‌ పై తాము కోర్టుకెక్కుతామని మొదట హెచ్చరించిన అదానీ సంస్థలు… ఆ తరువాత మేము కూడా సిద్ధమంటూ హిండెన్‌ బర్గ్‌ సవాలు చేయగానే… వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Boris Johnson | మిస్సైల్‌తో దాడి చేసి చంపేస్తానని నన్ను పుతిన్‌ బెదిరించారు…బ్రిటన్‌ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Jaishankar | అది నిన్న జరిగింది కాదు 1962లోనే.. రాహుల్ గాంధీపై జైశంకర్ ఆగ్రహం

America-China War | రెండేళ్లలో అమెరికా, చైనా మధ్య యుద్ధం.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ సంచలన వ్యాఖ్యలు!

Exit mobile version