Home News AP Andhra Pradesh Capital | ఏపీ సీఎం జగన్‌ కీలక ప్రకటన.. ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచిన...

Andhra Pradesh Capital | ఏపీ సీఎం జగన్‌ కీలక ప్రకటన.. ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచిన విశాఖపట్నం

Image Source: Pixabay

Andhra Pradesh Capital | ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రాజధాని విషయంతో పాటూ తాను కూడా విశాఖకి మారుతున్నట్లు ప్రకటించి ఏపీలో సంచలనాలకు తెర తీశారు. ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. పెట్టుబడిదారులను విశాఖకు ఆహ్వానిస్తూ విశాఖ రాజధాని కాబోతోందని చేసిన ఒక్క ప్రకటనతో విశాఖపట్నం హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

Visakhapatnam పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

లోకల్ మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యలను హైలైట్‌ చేసింది. ఇదిలా ఉంటే వైసీపీ సోషల్ మీడియా పేజీలు మా రాజధాని విశాఖ అంటూ హడావిడి చేస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రం ఈ వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నాయి. అసలు జగన్‌ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అనే దాని మీద కూడా భిన్నవాదనలు వినబడుతున్నాయి. కొందరు జగన్ ఇన్వెస్టర్ల సదస్సు కోసం వెళ్లారంటే.. మరికొందరు మాత్రం సీబీఐ తన మీద పెట్టిన దృష్టిని దారి మళ్లించేందుకు అనే మాటలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే విశాఖ గురించి కీలక వ్యాఖ్యలు చేస్తే అందరి చూపు విశాఖ మీదకు పోతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి మాటలు మాట్లాడి ఉండొచ్చని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి.
ఏపీ రాజధాని విషయం గురించి సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగానే విశాఖ రాజధాని కాబోతుందని ఎలా భావిస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. జగన్‌ మాటలు కోర్టు ధిక్కారణ కిందకి వస్తుందని అంటున్నారు. కొద్ది రోజుల కిందట ఉగాది తరువాత నుంచి విశాఖ నుంచి పాలన సాగిస్తామని కొందరు వైసీపీ నేతలు బాహాటంగానే ప్రకటించిన విషయం తెలిసిందే!

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

YS Jagan | విశాఖ నుంచే పరిపాలన.. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కన్ఫార్మ్ చేసిన ఏపీ సీఎం జగన్

LPG Cylinder | గ్యాస్ సిలిండర్ డెలివరీకి డబ్బులు అడుగుతున్నారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి

AP CM Jagan | తోడేళ్లు అన్నీ ఒక్కటవుతున్నాయి.. మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ సెటైర్లు

Tarakaratna | విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

AP CM Jagan | ఏపీ సీఎం జగన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Exit mobile version