Tuesday, April 23, 2024
- Advertisment -
HomeNewsInternationalCorona | ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోందా ? అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్...

Corona | ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోందా ? అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ !

Corona | కరోనా మళ్లీ విరుచుకుపడనుందా..? రెండేళ్లు ప్రపంచాన్ని అతలాకుతలం చేసి శాంతించినట్లు కనిపించిన కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోందా? తాజా పరిస్థితులను చూస్తుంటే మరింత జాగ్రత్తగా.. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చేసిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే కరోనాతో చైనా అతలాకుతలం అవుతోంది. రోజురోజుకు వైరస్‌ విజృంభిస్తుండటంతో అక్కడి ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓ వైపు కేసులు పెరుగుతుంటే.. మరోవైపు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. సెకండ్‌ వేవ్‌ తర్వాత భారీగా కేసులు నమోదవడంతో చైనా సర్కారు జీరో కోవిడ్‌ పాలసీని తీసుకొచ్చింది. అడుగు బయటపెట్టకుండా ఆంక్షలు విధించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో జీరో కోవిడ్‌ పాలసీని సడలించింది. దీంతో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.

Corona Virus
Corona Virus

ఒక్క చైనాలోనే కాదు.. అమెరికా, జపాన్‌ , కొరియా, బ్రెజిల్‌లో తాజాగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్లు పెరుగుతున్నాయి. అయితే పలు దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు పెరగడంపై కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. కొత్త వేరియంట్లపై జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలను ఆదేశించింది. పాజిటివ్‌ కేసుల నమూనాలను జోనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని సూచించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

China | చైనాలో కరోనా తెచ్చిన కష్టం.. నిమ్మకాయల కోసం ఎగబడుతున్న జనాలు.. కారణమిదే

Warship Sinks | సముద్రంలో మునిగిపోయిన నేవీ నౌక.. 31 మంది గల్లంతు

COVID19 | చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. ఏప్రిల్ నాటికి 30 శాతం మందికి కొవిడ్ వచ్చే ఛాన్స్

Notice for Taj Mahal | చరిత్రలో తొలిసారి తాజ్‌మహల్‌కు నోటీసులు.. ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించాలంటూ ఆదేశాలు

Gas cylinder for Rs. 500 | రాజస్థాన్‌లో 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం.. ఏప్రిల్ 1 నుంచి అమలు

Mrs world | 21 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన మిసెస్ వరల్డ్ కిరీటం.. విజేతగా నిలిచిన వైజాగ్ టీచర్

Sazia Marri | మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని మరిచిపోవద్దు.. భారత్‌కు పాక్ వార్నింగ్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News