Thursday, December 7, 2023
- Advertisment -
HomeEntertainmentAnupama Parameswaran | అనుపమను చూస్తే భయమేసింది.. అందుకే రంగస్థలం సినిమాలో ఆఫర్‌ ఇవ్వలేదు.....

Anupama Parameswaran | అనుపమను చూస్తే భయమేసింది.. అందుకే రంగస్థలం సినిమాలో ఆఫర్‌ ఇవ్వలేదు.. అసలు విషయం చెప్పిన సుకుమార్‌

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్‌ దగ్గర అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం తక్కువే అని చెప్పాలి. టాలీవుడ్‌లో ఈ మలయాళ కుట్టికి మంచి క్రేజ్‌ ఉంది. అయినప్పటికీ ఈమె అవకాశాల కోసం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ప్రేమమ్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ.. ఇప్పటివరకు ఒక్క స్టార్‌ హీరోతో నటించే ఛాన్స్‌ దక్కించుకోలేకపోయింది. అందుకే తన వెనుక వచ్చిన చాలామంది హీరోయిన్లు స్టార్‌ స్టేటస్‌ అనుభవిస్తుంటే.. ప్రేమమ్‌ సినిమాతో కెరీర్‌ స్టార్ట్‌ చేసినప్పుడు ఎక్కడ ఉందో.. ఇప్పుడూ అక్కడే ఉంది. దీంతో అనుపమతో పాటు ఆమె ఫ్యాన్స్‌ కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌తోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ స్టార్‌ హీరో నటించిన బ్లాక్‌బస్టర్‌ సినిమాలో అనుపమ ఛాన్స్‌ మిస్‌ చేసుకుందని చెప్పి షాకిచ్చాడు లెక్కల మాస్టర్‌ సుకుమార్.

కార్తికేయ2 తర్వాత నిఖిల్‌ సిద్ధార్థ్‌, అనుపమ పరమేశ్వర్‌ కాంబినేషన్‌లో వస్తున్న 18 పేజిస్‌ . గీతా ఆర్ట్స్‌2, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుకుమార్‌ ఈ సినిమాకు కథ అందించాడు. డిసెంబర్‌ 23న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలోనే దర్శకుడు సుకుమార్‌ షాకింగ్‌ విషయం చెప్పాడు. రంగస్థలం సినిమాలో రామలక్ష్మీ పాత్ర అనుపమ చేయాల్సిందని చెప్పుకొచ్చాడు. ఆడిషన్స్‌లో ఓకే అనిపించినప్పటికీ తనను తీసుకోలేదని బయటపెట్టాడు. దానికి కారణం కూడా వివరించాడు.

రంగస్థలం సినిమాలో రామలక్ష్మీ పాత్ర కోసం సమంతను సెలెక్ట్‌ చేసేముందు ఆడిషన్స్‌ నిర్వహించామని సుకుమార్‌ తెలిపాడు. అనుపమ కూడా ఆడిషన్స్‌కు వచ్చిందని చెప్పాడు. తను ఆడిషన్‌ చేసి మాట్లాడుతుంటే అనుపమ ఏమో ప్రతిసారి వాళ్లమ్మ వైపు చూస్తుండటం గమనించానని అన్నాడు. సినిమా షూటింగ్‌ సమయంలోనూ యాక్షన్‌ చెబితే మళ్లీ వాళ్లమ్మనే చూస్తుందేమోనని భయమేసిందని వివరించాడు. అప్పుడు తను చిన్న పిల్ల అని.. ఇప్పుడు ఆమె గ్రేట్‌ పర్ఫార్మర్‌ అని చెప్పుకొచ్చాడు. తనతో తప్పకుండా ఒక సినిమా చేస్తానని ప్రకటించాడు.

ఏదేమైనా రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్రలో సమంత నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఒకవేళ ఆ పాత్ర అనుపమ చేసి ఉంటే కచ్చితంగా స్టార్‌ హీరోయిన్‌ అయ్యి ఉండేది. కానీ బంగారం లాంటి ఛాన్స్‌ మిస్‌ చేసుకుంది. ఈ విషయంలో ఇప్పటికీ బాధ పడుతూనే ఉంటానని అనుపమ కూడా చెప్పింది. కెరీర్‌ మొదట్లో ఇలా చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల స్టార్‌ స్టేటస్‌ అనుభవిస్తూ ఉండాల్సిన అనుపమ.. ఇప్పటికీ మీడియం రేంజ్‌ హీరోలతోనే సినిమాలు చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Bigg Boss season 7 | బిగ్‌బాస్ 7 ను బాలయ్య హోస్ట్ చేస్తాడా? నాగార్జున మనసులో ఉన్న హీరో ఎవరు?

Itlu maredumilli prajaneekam | ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేశ్ కొత్త చిత్రం.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Mrunal Thakur | రెమ్యునరేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్

Hanu Raghavapudi | సీతారామం సినిమాలో తెలుగు హీరోయిన్‌ను తీసుకోకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News