Home Latest News ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టీ20, వన్డేల్లో తగ్గేదే లే అంటున్న...

ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టీ20, వన్డేల్లో తగ్గేదే లే అంటున్న రోహిత్ సేన.. నెక్స్ట్ ఆసీస్‌తో గెలిస్తే..!

Image Source: Indian Cricket Team

ICC Rankings | స్వదేశంలో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న టీమిండియా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇటీవల శ్రీలంకను క్లీన్‌స్వీప్‌ చేసిన రోహిత్‌ సేన.. తాజాగా న్యూజిలాండ్‌పై అదే జోరు కొనసాగించింది. టాప్ ర్యాంకును చేజిక్కించుకుంది. ఇప్పటికే టీ20ల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

వన్డేల్లో ప్రస్తుతం 114 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. 113 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 112 పాయింట్లు, న్యూజిలాండ్ 111 పాయింట్లు, పాకిస్థాన్ 106 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ 276 పాయింట్లతో టాప్‌లో ఉంది. టీ20లోనూ ఇంగ్లండ్ 266 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్ 258, దక్షిణాఫ్రికా 256, న్యూజిలాండ్ 252 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మరోవైపు టెస్టు ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా ప్రస్తుతం 115 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా 126 పాయింట్లతో టాప్‌లో ఉంది. త్వరలో స్వదేశంలో ఆసీస్‌తో నాలుగు మ్యాచ్‌ల ‘బోర్డర్‌ గవాస్కర్‌’ టెస్టు సిరీస్‌ జరుగనున్న నేపథ్యంలో భారత జట్టు మూడు ఫార్మాట్లలో అగ్రస్థానానికి చేరే అరుదైన అవకాశం ఊరిస్తున్నది. కంగరూలపై టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేస్తే.. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ భారత్‌ అగ్రస్థానాన్ని చేజిక్కించుకోనుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

India Vs New Zealand | న్యూజిలాండ్‌పై మూడో వన్డేలోనూ భారత్‌ విజయం.. వన్డే సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

Naatu Naatu Song in Oscar list | ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ పాట.. ఎన్టీఆర్‌కు మాత్రం నిరాశే

Sarfaraz Khan | అర్జున్‌ టెండూల్కర్‌ కంటే అదృష్టవంతుడిని నాన్నా.. తండ్రితో సర్ఫరాజ్‌ఖాన్‌ భావోద్వేగం

Rohit Sharma Interview | ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు డబుల్ సెంచరీ వీరులు.. వైరల్‌ అవుతున్న రోహిత్‌ శర్మ ఇంటర్వ్యూ వీడియో

Exit mobile version