Home Lifestyle Horoscope & Vaasthu horoscope today | రాశిఫలాలు (25-01-2023)

horoscope today | రాశిఫలాలు (25-01-2023)

Image Source : Pixabay

horoscope today | మేషం

కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ, వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

వృషభం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

మిథునం

రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

కర్కాటకం

జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

సింహం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. రుణాలు కొంతవరకు తీరుస్తారు. అనుకున్న పనుల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తీరుతాయి. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

కన్య

ప్రముఖులను కలుసుకుంటారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహన యోగం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతాన సమస్యలు తీరి ఊరట చెందుతారు.

తుల

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. సన్నిహితులతో ఏర్పడిన విబేధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి నుంచి సహాయసహకారాలు అందుతాయి.

వృశ్చికం

కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. కీలక విషయాల్లో సన్నిహితుల సాయం అందుతుంది. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు

నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. భాగస్వామి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సోదరుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. నూతన విద్య అవకాశాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.

మకరం

కుటుంబ వ్యవహారాలు చికాకు పరుస్తున్నా జీవిత భాగస్వామి సహకారం అందుతుంది. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సన్నిహితులను కలుసుకుంటారు.

కుంభం

బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. బంధువులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. వాహన యోగం ఉంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన విద్య అవకాశాలు పొందుతారు.

Exit mobile version