Home News AP Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ బెటర్.. బీజేపీతో పొత్తు పెట్టుకోం కానీ కొత్తవారైతే...

Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ బెటర్.. బీజేపీతో పొత్తు పెట్టుకోం కానీ కొత్తవారైతే ఓకే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్

Janasena Chief Pawan Kalyan

Pawan Kalyan | తెలంగాణలో పోటీ చేసే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే తెలంగాణ సమస్యలపై లోతైన అధ్యయనం చేసిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు.

జగిత్యాల జిల్లా నాచుపల్లిలో ఏర్పాటు చేసిన జనసేన తెలంగాణ కార్యనిర్వాహకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పోటీపై పార్టీ శ్రేణులకు స్పష్టతనిచ్చారు. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో తాను లేనని.. ఇక్కడి ప్రజల నుంచి నేర్చకునే స్థాయిలోనే ఉన్నానని చెప్పారు. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్లే పరుషంగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు.

తెలంగాణలో పరిమితి సంఖ్యలోనే పోటీ చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. పరిమిత సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు, 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలన్న యోచనలో ఉన్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో 10 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణలో బీజేపీతో పొత్తు మాత్రం ఉండదన్నారు. ఇక్కడ ఇంకా ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమే అని అన్నారు. జనసేన భావజాలానికి దగ్గరగా వచ్చి.. పొత్తుకు వస్తే మాత్రం ఓకే చెబుతానని అన్నారు. అది బీజేపీ అయినా సరే అన్నారు.

తెలంగాణలో మైనింగ్ దోపిడీ జరుగుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయని స్థానాల్లో కూడా ప్రభావం చూపాలన్నారు. తెలంగాణలో చిన్న పోలీసు ఉద్యోగానికి ఇన్ని పరీక్షలు ఉంటే.. ప్రజాప్రతినిధులకు ఎన్ని పరీక్షలు ఉండాలని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యం అనే పదానికి ఏపీలో విలువ లేదు..

ఆంధ్రప్రదేశ్‌లో పాలన కంటే తెలంగాణలో పాలన బాగుందన్నారు. అయితే ఏపీ, తెలంగాణలో సమస్యలను పోల్చలేమన్నారు. ఆంధ్రాలో కులాల గీతల మధ్యలో రాజకీయం చేయాలన్నారు. అది తనకు చాలా కష్టంతో కూడుకున్న పని అని అన్నారు. ఏపీలో ఉన్నవాళ్లు మామూలు వాళ్లు కాదని, సొంత బాబాయ్‌ని చంపించుకునే వాళ్లంటూ ఏపీ సీఎం జగన్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యం అనే పదానికి ఏపీలో విలువ లేకుండా పోయిందన్నారు. న్యాయవ్యవస్థను తిట్టేవాళ్లు ఉన్నారని, పోలీసు వ్యవస్థను తమకు ఇష్టానుసారంగా వాడుకునే వాళ్లు ఉన్నారనంటూ వైఎస్ఆర్సీపీ నేతలను ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు చేయించిన పవన్ కళ్యాణ్.. అక్కడే ఎందుకు?

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

Pawan Kalyan | ఏపీ సీఎం జగన్‌కు గ్యాంబ్లింగ్‌ పిచ్చి.. ఆ డైమండ్‌ రాణితోనూ తిట్లు తింటున్నా: పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Uppal Match | ఉప్పల్‌లో శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ.. ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్‌పై భారత్‌ ఘన విజయం

Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

Exit mobile version