Home Latest News Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

Image Source: Umesh Yadav Facebook

Umesh Yadav | నమ్మిన వారే ఎక్కువగా మోసం చేస్తున్న రోజులివి. కొద్ది రోజుల క్రితమే జమైకా చిరుత ఉసేన్‌ బోల్డ్‌ ఖాతాలో నుంచి ఏకంగా సిబ్బందే రూ. 103 కోట్లను ఖాళీ చేయగా… తాజాగా టీమిండియా క్రికెటర్‌ ఉమేశ్‌ యాదవ్‌‌ని స్నేహితుడే ముంచేశాడు. ఎంతో కాలంగా మేనేజర్‌‌గా వ్యవహరించిన వ్యక్తే ఏకంగా రూ. 44 లక్షలు ఖాతాలో వేసేసుకున్నాడు.

అసలేం జరిగిందంటే.. ఉమేశ్‌ స్నేహితుడు శైలేశ్‌ ఠాక్రేతో ఉమేశ్‌‌కు ఎంతో కాలంగా స్నేహం ఉంది. టీమిండియాకు ఉమేశ్‌‌కు ఎంపికయ్యాక, తన వ్యవహారాలు చూసుకునేందుకు ఠాక్రేను పర్సనల్‌ మేనేజర్‌గా ఏర్పాటు చేసుకున్నాడు. ఉమేశ్‌‌కి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆదాయపు పన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్ని ఠాక్రేనే చక్కబెట్టేవాడు.

అయితే ఇటీవల కాలంలో ఓ మంచి స్థలం అమ్మకానికి వచ్చిందని చెప్పడంతో ఉమేశ్‌ కూడా ఆ స్థలం కొనేందుకు ముందుకు వచ్చాడు. అందుకుగానూ దాదాపు రూ. 44 లక్షలను ఠాక్రే ఖాతాలో వేశాడు. అయితే ఠాక్రే మాత్రం ఆ స్థలాన్ని తన పేరిట కొనుగోలు చేశాడు. దాంతో ఠాక్రే తనను దారుణంగా మోసం చేశాడని గుర్తించాడు ఉమేశ్‌. తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. అందుకు ఠాక్రే ససేమిరా అనడంతో.. ఉమేశ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఉమేశ్‌ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి సెక్షన్‌ 406, 420 కింద ఠాక్రే పై కేసు నమోదు చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Usain Bolt | రూ. 100 కోట్లు పోగొట్టుకున్న పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్.. అకౌంట్‌లోని నుంచి సొమ్మంతా ఖాళీ

Rakul Preet Singh | నాతో షూటింగ్ చేసి.. వేరే హీరోయిన్‌ను తీసుకునేవాళ్లు.. నాటి రోజులు గుర్తు చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్

mahanati savitri | లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్.. వ్యాపారంలో సక్సెస్ కావడానికి మహానటి సావిత్రికి సంబంధం ఉంది తెలుసా?

Naga babu | ఏపీలో జనసేన పొత్తులపై మెగాబ్రదర్ కీలక వ్యాఖ్యలు.. పవన్‌ను ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమన్న నాగబాబు!

Kangana Ranut | ఆర్థిక ఇబ్బందుల్లో కంగనా రనౌత్.. ఆ సినిమా కోసం తన ఆస్తులన్ని తాకట్టు పెట్టిందా ?

India Vs New Zealand | రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం

Exit mobile version