Home Latest News India Vs New Zealand | న్యూజిలాండ్‌పై మూడో వన్డేలోనూ భారత్‌ విజయం.. వన్డే సిరీస్‌...

India Vs New Zealand | న్యూజిలాండ్‌పై మూడో వన్డేలోనూ భారత్‌ విజయం.. వన్డే సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

Image Source Indian cricket team Facebook

India Vs New Zealand | న్యూజిలాండ్‌తో ఇండోర్‌ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలోనూ భారత్‌ ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్‌ చేసింది. 386 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్‌ను 41.2 ఓవర్లలో 295 పరుగులకు భారత్‌ ఆలౌట్‌ చేసింది. దీంతో 90 పరుగుల తేడాతో కివీస్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డేవాన్‌ కాన్వే ( 138) సెంచరీతో చెలరేగాడు. నికోల్స్‌ 42 పరుగులు, శాంటర్న్‌ 34 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ చెరో మూడు వికెట్లు తీశారు. చాహల్‌ రెండు వికెట్లు, హార్దిక్‌ పాండ్య, ఉమ్రాన్‌ మాలిక్‌ ఒక్కో వికెట్‌ తీశారు. కాగా, మొదటి వన్డేలో డబుల్‌ సెంచరీ, చివరి వన్డేలో సెంచరీ చేసిన శుభ్‌మన్‌ గిల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ సెంచరీలతో చెలరేగిపోయారు. రోహిత్‌ శర్మ 83 బంతుల్లో సెంచరీ చేయగా.. శుభ్‌మన్‌ గిల్‌ 72 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వీరిద్దరూ 26 ఓవర్లలో తొలి వికెట్‌కు 212 పరుగులు జోడించారు. అయితే ఓపెనర్లు మినహా టాప్‌ ఆర్డర్‌ అంతా విఫలమయ్యారు. కోహ్లీ 36, ఇషాన్‌ 17 , సూర్యకుమార్‌ యాదవ్‌ 14, వాషింగ్టన్‌ సుందర్‌ 9, హార్దిక్‌ పాండ్యా 54, శార్దూల్‌ ఠాకూర్‌ 25 పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జాకబ్‌ డఫ్పీ, బ్లెయిర్‌ తిక్నర్‌ చెరో మూడు వికెట్లు తీశారు. మైకెల్‌ బ్రాస్‌వెల్‌ ఒక వికెట్‌ తీశాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

India Vs New Zealand | న్యూజిలాండ్‌ విజయలక్ష్యం 386 పరుగులు.. సెంచరీలతో చెలరేగిన రోహిత్‌ శర్మ, గిల్‌

Ravindra Jadeja | జడ్డూ పునరాగమనం.. ఆర్నెళ్ల తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెడుతున్న రవీంద్ర జడేజా.. అరవంలో ట్వీట్‌

Kl Rahul – Athiya Shetty | ఓ ఇంటివాడైన కేఎల్‌ రాహుల్‌.. ప్రియురాలు అతియా శెట్టితో ఏడడుగులు

Vijay devarakonda | బ్లాక్‌హాక్స్‌ అంబాసిడర్‌గా విజయ్‌ దేవరకొండ..

Sarfaraz Khan | అర్జున్‌ టెండూల్కర్‌ కంటే అదృష్టవంతుడిని నాన్నా.. తండ్రితో సర్ఫరాజ్‌ఖాన్‌ భావోద్వేగం

Exit mobile version