Home Latest News BBC | బీబీసీ ఆఫీసుల్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ శాఖ సోదాలు.. స్పందించిన అమెరికా

BBC | బీబీసీ ఆఫీసుల్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ శాఖ సోదాలు.. స్పందించిన అమెరికా

BBC | బీబీసీ ఆఫీసుల్లో వరుసగా రెండో రోజు ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ముంబై, ఢిల్లీలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.

అయితే దీనిపై బీబీసీ స్పందించింది. ఆదాయపన్ను శాఖ అధికారులకు సహకరించాలని బీబీసీ తన ఉద్యోగులకు మెయిల్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించింది. అయితే ఐటీ శాఖ సోదాలపై సోషల్ మీడియా వేదికల్లో ఎవరూ స్పందించకూడదని ఉద్యోగులకు స్పష్టం చేసింది. గోద్రా మారణకాండ వెనుక అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ ఇటీవలే రెండు భాగాలుగా వివాదాస్పద డాక్యుమెంటరీ విడుదల చేసింది. ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ డాక్యుమెంటరీ సంచలనంగా మారింది.

నరేంద్ర మోదీకి న్యాయస్థానాల్లో క్లీన్ చీట్ లభించిన తర్వాత కూడా అబండాలు వేసే ప్రయత్నం బీబీసీ చేసిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. మోదీపై వివాదస్పద డాక్యుమెంటరీ రూపొందించిన తర్వాతే బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించడంపై కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పించాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు. హిండెన్‌బర్గ్‌పైనా దర్యాప్తు చేస్తారా అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించడంపై అగ్ర రాజ్యం అమెరికా స్పందించింది. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిపుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్న అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్.. ప్రపంచవ్యాప్తంగా ప్రతికా స్వేచ్ఛకు ప్రాధాన్యం ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భావ ప్రకటనా స్వేచ్ఛ, మతపరమైన స్వేచ్ఛ, విశ్వాసపరమైన స్వేచ్ఛ మానవహక్కులుగా దోహదపడతాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే చర్యలను తాము నిరంతరం ప్రస్తావిస్తూనే ఉంటామన్నారు. ఈ స్వేచ్ఛాయుత వాతావరణమే అమెరికాతో పాటు భారత్‌లోనూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని పునరుద్ఘాటించారు. అయితే బీబీసీ ఐటీ శాఖ దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమా అని విలేకరులు ప్రశ్నించగా ఆచితూచి స్పందించారు. సోదాలపై నిజానిజాలు తమకు తెలుసని అయితే వీటిపై తీర్పు ఇచ్చే స్థాయిలో తాను లేనని వ్యాఖ్యానించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Shruti haasan | రూమర్స్‌కు అలా చెక్ పెట్టిన శృతి హాసన్.. నా ప్రియుడు నాకే సొంతం..!

WPL 2023 Schedule | డబ్ల్యూపీఎల్‌ నగారా.. తొలి సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

Kuthuhalamma | ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ కన్నుమూత

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!

Shah rukh khan | షారుక్ ఖాన్ ఇటు వైపు నుంచి నరుక్కొస్తున్నాడా.. పెద్ద ప్లానే ఇది..!

Exit mobile version