Home Latest News WPL 2023 Schedule | డబ్ల్యూపీఎల్‌ నగారా.. తొలి సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

WPL 2023 Schedule | డబ్ల్యూపీఎల్‌ నగారా.. తొలి సీజన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన బీసీసీఐ

WPL 2023 Schedule | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) తొలి సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 4న ప్రారంభం కానున్న ఈ లీగ్‌.. 26న ముగియనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. డబ్ల్యూపీఎల్‌ తొలి సీజన్‌లో 5 జట్లు పాల్గొంటుండగా.. మొత్తం 22 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లీగ్‌ ఆరంభ పోరులో (మార్చి 4న) గుజరాత్‌ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు డీవై పాటిల్‌ స్టేడియం వేదిక కానుండగా.. లీగ్‌లో అన్నీ మ్యాచ్‌లు ముంబైలోనే జరుగనున్నాయి. రాత్రి 7.30 నుంచి మ్యాచ్‌లు ప్రారంభించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. రెండో మ్యాచ్‌ మార్చి 5న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగనుంది. అదే రోజు యూపీ వారియర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య మూడో పోరు జరుగనుంది.

నాలుగు డబుల్‌ హెడర్స్‌

లీగ్‌ ఆరంభ మ్యాచ్‌తో పాటు ఎలిమినేటర్‌ (మార్చి 24) మ్యాచ్‌లకు నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదిక కానుంది. మార్చి 26న బబ్రౌర్న్‌ స్టేడియంలో ఫైనల్‌ నిర్వహించనున్నారు. ‘మార్చి 5 (ఆదివారం) డబ్ల్యూపీఎల్‌లో తొలి డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ నిర్వహిస్తాం. తొలి పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్‌, రెండో మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో గుజరాత్‌ జెయింట్స్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. లీగ్‌లో మొత్తం 4 డబుల్‌ హెడర్స్‌ ఉంటాయి. రెండు మ్యాచ్‌లు ఉన్న రోజు తొలి పోరు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో పోరు యధావిధిగా 7.30కు స్టార్ట్‌ అవుతుంది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

వేలానికి ఫుల్‌ క్రేజ్‌

పురుషుల క్రికెట్‌లో ఐపీఎల్‌ తరహాలో మహిళల కోసం ప్రత్యేక లీగ్‌ నిర్వహించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న బీసీసీఐ.. ఆ దిశగా తీవ్ర ప్రయత్నాల అనంతరం డబ్ల్యూపీఎల్‌కు శ్రీకారం చుట్టింది. తొలి సీజన్‌ కోసం ముంబై వేదికగా సోమవారం నిర్వహించిన వేలంలో అమ్మాయిలు అదిరిపోయే ధర పలికిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధన్నా కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) అత్యధికంగా రూ. 3.4 కోట్లు వెచ్చించగా.. అంతర్జాతీయ స్టార్లు నటాలియా స్కీవర్‌ (ముంబై), ఆష్లే గార్డ్‌నర్‌ (గుజరాత్‌) చెరో 3.2 కోట్లు దక్కించుకున్నారు. ఫ్రాంచైజీలన్నీ ఆల్‌రౌండర్ల కోసం పోటీపడగా.. దీప్తి శర్మను రూ. 2.6 కోట్లకు యూపీ జట్టు చేజిక్కించుకుంది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అజేయ అర్ధశతకం బాదిన జెమీమా రోడ్రిగ్స్‌ (ఢిల్లీ)కు అనూహ్యంగా 2.2 కోట్లు దక్కగా.. భారత కెప్టెన్‌ను హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను రూ. 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్‌ కైవసం చేసుకుంది. ఈ వేలంలో 10 మంది భారత ప్లేయర్లు కోటి రూపాయల మార్క్‌ దాటారు.

డబ్ల్యూపీఎల్‌ 5 టీమ్‌ల వివరాలు

బెంగళూరు: మంధన్నా, సోఫీ డివైన్‌, ఎలీసా పెర్రీ, రేణుక, రిచ, బర్న్స్‌, దిశ, ఇంద్రాణి, శ్రేయాంక, కనిక, ఆశ, హీతర్‌ నైట్‌, నికెర్క్‌, ప్రీతి, పూనమ్‌, కోమల్‌, మేగన షుట్‌, షహానా పవార్‌.

ముంబై: హర్మన్‌ప్రీత్‌, స్కీవర్‌, అమెలియా కెర్‌, పూజ వస్త్రాకర్‌, యష్తిక, హీతర్‌ , ఇస్సీ వాంగ్‌, అమన్‌జోత్‌ కౌర్‌, ధారా గుజ్జర్‌, షైకా, మాథ్యూస్‌, ట్రియాన్‌, హుమైరా కాజీ, ప్రియాంక బాల, సోనమ్‌ యాదవ్‌, జింతిమణి కలితా, నీలమ్‌ బిష్త్‌.

గుజరాత్‌: గార్డ్‌నర్‌, మూనీ, సోఫియా, సథెర్‌లాండ్‌, హర్లీన్‌ డియోల్‌, డెండ్రా డాటిన్‌, స్నేహ్‌ రాణా, మేఘన, జార్జియా, మాన్సి జోషీ, హేమలత, తనూజ, మోనిక, సుష్మ, హర్లీ, అశ్విని, పరునిక, షబ్నమ్‌.

యూపీ: సోఫియా, దీప్తి, తహిలా మెక్‌గ్రాత్‌, షబ్నమ్‌ ఇస్మాయిల్‌, హీలీ, అంజలి, రాజేశ్వరి, పార్షవి, శ్వేత షెరావత్‌, యశశ్రీ, కిరణ్‌ నవగిరె, హారిస్‌, దేవిక, లారెన్‌ బెల్‌, లక్ష్మి, సిమ్రన్‌.

ఢిల్లీ: జెమీమా రోడ్రిగ్స్‌, లానింగ్‌, షఫాలీ, రాధ, శిఖ, మరిజానె, టిటాస్‌, కాప్సె, టారా నోరిస్‌, లారా హారిస్‌, జాసియా అక్తర్‌, మిన్ను మని, తానియా భాటియా, జెస్‌ జాన్సెన్‌, స్నేహ, పూనమ్‌, అరుంధతి, అపర్ణ.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sachin Tendulkar | జిల్లా స్థాయి టోర్నీలో ఓ ప్లేయర్‌ ప్రతిభకు సచిన్‌ టెండూల్కర్‌ ఫిదా..

Mohammed Shami | రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీని దాటేసిన మహమ్మద్‌ షమీ..

Ravindra Jadeja | జడేజాకి షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత

IND vs AUS | మూడు రోజుల్లోనే ముగిసే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి

Rishabh Pant | ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కర్రలసాయంతో నడిచేందుకు ట్రై చేస్తున్న రిషబ్ పంత్

Exit mobile version