Home Entertainment Shah rukh khan | షారుక్ ఖాన్ ఇటు వైపు నుంచి నరుక్కొస్తున్నాడా.. పెద్ద ప్లానే...

Shah rukh khan | షారుక్ ఖాన్ ఇటు వైపు నుంచి నరుక్కొస్తున్నాడా.. పెద్ద ప్లానే ఇది..!

Shah rukh khan | బాలీవుడ్ సినిమాలు ఇక ఆడవు.. వాళ్ళ పని అయిపోయింది.. అక్కడి హీరోలను కూడా ఆడియన్స్ చూడటం మానేసారు.. అంటూ అంతా ఫిక్సైపోయారు. అనుకున్నట్లుగానే మూడేళ్లుగా ఒక్కటంటే ఒక్క బ్లాక్‌బస్టర్ కూడా రాలేదక్కడ. మరీ ముఖ్యంగా కరోనా సీజన్ తర్వాత స్టార్ హీరోలను దారుణంగా చూస్తున్నారు ప్రేక్షకులు.

అది చాలదన్నట్లు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఆడియన్స్‌కు బాలీవుడ్ హీరోలపై ఎక్కడ లేని కోపం వచ్చింది. వారసుల సినిమాలనైతే తీసి పక్కన బెట్టేస్తున్నారు ప్రేక్షకులు. నిజంగానే ఇంక బాలీవుడ్ పని అయిపోయిందేమో అనుకుంటున్న సమయంలోనే షారుక్ ఖాన్ పఠాన్ సినిమా వచ్చింది. తొలిరోజే 106 కోట్లు కేవలం ఇండియాలోనే వసూలు చేసింది ఈ చిత్రం. ఇప్పటి వరకు 900 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ రికార్డులన్నింటికీ ఒకేసారి చెక్ పెట్టింది పఠాన్.

ఈ సినిమా విజయం చూసిన తర్వాత మిగిలిన హీరోలకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమా బాగుంటే కచ్చితంగా కలెక్షన్లు వస్తాయని నమ్ముతున్నారంతా. అయితే అది అంత సులువైన పని అయితే కాదు. షారుక్ అంటే సొంతంగా ఇండస్ట్రీకి వచ్చిన హీరో.. ఆయనకు నెపోటిజం లేదు కాబట్టి అతడి సినిమాను ఆడియన్స్ అక్కున చేర్చుకున్నారు. ఈ క్రమంలోనే తన తర్వాతి సినిమా జవాన్‌కు కూడా జబర్దస్త్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు కింగ్ ఖాన్.

మరీ ముఖ్యంగా సౌత్ కలెక్షన్లపై కన్నేసాడు బాద్షా. దీనికోసం ఇద్దరు స్టార్ హీరోలను తన సినిమాలో అతిథి పాత్రలు చేయించేలా ప్లాన్ సిద్ధం చేసాడు. అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాలో ఇప్పటికే నయనతార, విజయ్ సేతుపతి లాంటి సౌత్ స్టార్స్ ఉన్నారు. వీళ్లు చాలరన్నట్లు దళపతి విజయ్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అట్లీతో ఉన్న స్నేహం.. షారుక్‌పై ఉన్న అభిమానంతో ఈ కారెక్టర్ చేస్తున్నాడు విజయ్.

ఇప్పుడేమో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ సైతం జవాన్‌లో ఓ అతిథి పాత్ర చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా అంతా బన్నీ, జవాన్ సినిమా గురించే కోడైకూస్తుంది. ఇదే కానీ నిజమైతే బాలీవుడ్ మొత్తం బాద్షా చూసుకుంటాడు.. తెలుగు, కన్నడ మార్కెట్స్ బన్నీ హ్యాండిల్ చేస్తాడు.. తమిళం, మలయాళం అంతా విజయ్ చూసుకుంటాడు. అలా ఇండియా అంతా జవాన్ మాయ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు షారుక్ ఖాన్. జూన్ 3న విడుదల కానుంది ఈ సినిమా.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ramcharan | ఆ కొరియోగ్రఫర్‌తో కలిసి మెగా ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్..

Nayanthara | నా భర్తనే అవమానిస్తారా? ఆ హీరోతో జన్మలో నటించను.. మంగమ్మ శపథం పట్టిన నయనతార?

Actress Hema | కొత్త బిజినెస్‌ పెట్టా.. అందుకే సినిమాలు మానేశా.. అసలు విషయం చెప్పిన హేమ

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

Exit mobile version