Home Entertainment Shruti haasan | రూమర్స్‌కు అలా చెక్ పెట్టిన శృతి హాసన్.. నా ప్రియుడు నాకే...

Shruti haasan | రూమర్స్‌కు అలా చెక్ పెట్టిన శృతి హాసన్.. నా ప్రియుడు నాకే సొంతం..!

Shruti haasan | సినిమాల కంటే ఎక్కువగా ఎఫైర్స్‌తోనే ఇండస్ట్రీలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శృతి హాసన్. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి వచ్చినా కూడా తండ్రి పేరు వాడుకోకుండా అవకాశాలు తెచ్చుకుంటేనే తనకు మజా అంటూ చాలా సార్లు చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అలాగే తనకు ఆఫర్స్ కూడా వస్తున్నాయంటూ సంబరపడుతుంది.

ఈ మధ్యే సంక్రాంతికి అటు వాల్తేరు వీరయ్య.. ఇటు వీరసింహారెడ్డి సినిమాలలో నటించి వరస హిట్స్ ఖాతాలో వేసుకుంది శృతి హాసన్. దాంతో పాటు ప్రభాస్ సలార్ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తుంది ఈ బ్యూటీ. వరస సినిమాలతో బిజీగా ఉన్న శృతి.. హిందీ, తమిళంలోనూ అవకాశాలు సాధిస్తుంది. ఇదిలా ఉంటే పర్సనల్ లైఫ్‌లోనూ ఈ భామ చాలా బిజీగా ఉంది.

ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తుంది శృతి హాసన్. ఆ మధ్య ఫారెన్ అబ్బాయి మైఖెల్ కోర్సెల్‌తో ప్రేమలో కొన్నేళ్లున్న శృతి హాసన్.. అతడితో విడిపోయిన తర్వాత శాంతనుతో డేటింగ్ స్టార్ట్ చేసింది. వీళ్ల మధ్యలోనూ గొడవలు వచ్చాయని.. విడిపోయారని ఆ మధ్య ప్రచారం బాగానే జరిగింది. అయితే అందులో నిజం లేదని అప్పుడే కొట్టి పారేసింది శృతి హాసన్.

ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా తన ప్రేమను మరింత ఘాటుగా చూపించింది. ప్రియుడి కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ.. ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఇది చూసిన తర్వాత ఈమె ప్రేమలో ఎంత ఘాటుగా మునిగిపోయిందో అర్థం అయిపోతుంది. ఈ ఫోటో చూస్తుంటే ఇప్పుడే కాదు.. ఇప్పట్లో ఎప్పుడూ విడిపోము అని రూమర్స్‌కు గట్టిగా చెక్ పెట్టినట్లు అర్థమవుతుంది. అమ్మడు షేర్ చేసిన ఫోటో కూడా కలర్ కాదు.. బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది.

ఈ పోస్ట్ కింద నువ్వు నా బెస్ట్.. నువ్వు ఎప్పుడూ నా మదిలోనే ఉంటావు.. నువ్వే నా వెలుగు.. నువ్వే నా చీకటి అంటూ కవి హృదయంతో రాసుకొచ్చింది శృతి హాసన్. నీ ప్రేమ దొరకడం అనేది నాకు దక్కిన అదృష్టం అంటూ తన ప్రియుడిపై ప్రేమ వర్షం కురిపించింది ఈ బ్యూటీ. మొత్తానికి ఈ ప్రేమైనా పెళ్లి వరకు వస్తుందో లేదంటే మధ్యలోనే ఆగిపోతుందో చూడాలిక.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ గారూ.. చెప్పినంత ఈజీ కాదు సర్ డేట్స్ ఇవ్వడం..!

Shah rukh khan | షారుక్ ఖాన్ ఇటు వైపు నుంచి నరుక్కొస్తున్నాడా.. పెద్ద ప్లానే ఇది..!

Ramcharan | ఆ కొరియోగ్రఫర్‌తో కలిసి మెగా ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్..

Nayanthara | నా భర్తనే అవమానిస్తారా? ఆ హీరోతో జన్మలో నటించను.. మంగమ్మ శపథం పట్టిన నయనతార?

Actress Hema | కొత్త బిజినెస్‌ పెట్టా.. అందుకే సినిమాలు మానేశా.. అసలు విషయం చెప్పిన హేమ

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

Exit mobile version