Home Latest News iPhone | ఐఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేసిన యువకుడు.. కర్ణాటకలో దారుణం

iPhone | ఐఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేసిన యువకుడు.. కర్ణాటకలో దారుణం

iPhone | ఐఫోన్ అంటే యూత్‌లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త మోడల్ ఐఫోన్ కోసం కిడ్నీలు అమ్ముకున్నారని, దొంగతనాలు చేశారని చాలా సందర్భాల్లో వింటూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ యువకుడు అయితే ఐఫోన్ కోసం ఏకంగా మర్డర్ చేశాడు. కర్ణాటకలో ఫిబ్రవరి 7న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హసన్‌ జిల్లాకు చెందిన హేమంత్‌ దత్తా అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌పై ఆఫర్ ఉండటం చూసి బుక్ చేశాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో క్యాష్ ఆన్ డెలివరీ మోడ్‌తో ఐఫోన్ ఆర్డర్ చేశాడు. ఫోన్ వచ్చేలోపు రూ.46 వేలు అడ్జస్ట్ చేద్దామని అనుకున్నాడు. కానీ కుదరలేదు. తీరా ఫిబ్రవరి 7వ తేదీన ఐఫోన్ డెలివరీకి వచ్చింది. డెలివరీ బాయ్ మొబైల్ ఇవ్వడానికి హేమంత్ అడ్రస్‌కు వచ్చాడు. రాగానే బాక్స్ ఓపెన్ చేసి మొబైల్ చూపించాలని అడిగాడు. అందుకు డెలివరీ బాయ్ నిరాకరించాడు. ముందు డబ్బులు కట్టండి.. అప్పుడే ఓపెన్ చేస్తానని బదులిచ్చాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. కాసేపు ఇంట్లో కూర్చుంటే డబ్బులు తీసుకొస్తానని చెప్పాడు. దీంతో బయట కూర్చున్న డెలివరీ బాయ్‌ని కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి రమ్మని పిలిచి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో డెలివరీ బాయ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఏం చేయాలో అర్థంకాక మృతదేహాన్ని ఇంట్లోని బాత్రూంలో దాచిపెట్టాడు. నాలుగు రోజుల తర్వాత శవం నుంచి వాసన రావడంతో ఒక గోనె సంచిలో వేసి.. బైక్‌పై సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడే పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు.

మరోవైపు డ్యూటీకి వెళ్లిన తన సోదరుడు కనిపించకపోవడంతో డెలివరీ బాయ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజి ఆధారంగా హేమంత్ దగ్గరికే చివరగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హేమంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. ఐఫోన్ కోసమే డెలివరీ బాయ్ ను హత్య చేశానని… మృతదేహాన్ని పెట్రోల్ పోసి అంటించినట్లు వివరించాడు. డెలివరీ బాయ్ మృతదేహాన్ని హేమంత్ బైక్ పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో కనిపించినట్లు పోలీసులు వివరించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

Exit mobile version