Home Entertainment NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

NTR | నందమూరి ఫ్యామిలీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కొన్నేళ్లుగా ఆ కుటుంబానికి అస్సలు బాగుండటం లేదు. ఎన్టీఆర్ వారసులు అంతా సడెన్‌గా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషాదాలు నందమూరి వంశంలో తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో లేకపోతే.. అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతుండటం అందర్నీ కలిచివేస్తోంది. తాజాగా నందమూరి తారకరత్న కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించడంతో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నందమూరి ఫ్యామిలీకి ఏదో శాపం తగిలిందని.. అందుకే ఉన్నట్టుండి ఒక్కొక్కరుగా అంతా మరణిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

జానకీరామ్ మరణంతో మొదలైన వరుస విషాదాలు

నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ 2014లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. డిసెంబర్ 6న కోదాడ సమీపంలోని ఆకుపాముల వద్ద జానకీరామ్ ప్రయాణిస్తున్న సఫారీ కారును ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూశాడు. ఓ అభిమాని వివాహానికి హాజరై వస్తుండగా నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద విజయవాడ – హైదరాబాద్ రహదారిపై హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది 2018 ఆగస్టు 29న జరిగిన ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఎన్టీఆర్ కూతురు సూసైడ్

సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు కంటమనేని ఉమామహేశ్వరి 2022 ఆగస్టు 1వ తేదీన బలవన్మరణానికి పాల్పడింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. అకాల మరణం పలు అనుమానాలకు తావిచ్చింది. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది.

సీనియర్ ఎన్టీఆర్ మరణం సమయంలోనూ..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగువెలుగిన సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించాడు. తెలుగు దేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు. అలాంటి మహోన్నత వ్యక్తికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు టీడీపీని లాక్కున్నాడు. దీంతో చివరి రోజుల్లో తీవ్ర క్షోభ అనుభవించి 1996లో గుండెపోటుతో మరణించాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు కన్నుమూశాడు. రోడ్డు ప్రమాదం కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అంతకుమందు త్రివిక్రమరావు కుమారుడు హరిన్ చక్రవర్తి సైతం ఓ ప్రమాదంలో మరణించాడు. హరిన్ చక్రవర్తి సోదరుడు కల్యాణ్ చక్రవర్తి కుమారుడు పృథ్వీ కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

తారక్ ఒక్కడే తప్పించుకున్నాడు

2009 ఎన్నికలప్పుడు టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ బతకడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయపడ్డాడు. కానీ 2014లో జానకీరామ్, 2018లో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. లక్ష్మయ్య తర్వాత ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు, అతని కొడుకు హరిన్ చక్రవర్తి, మనవడు పృథ్వీ యాక్సిడెంట్‌లోనే మృతిచెందారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

BRS MLA Sayanna | బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..

Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం

Viral News | గుజరాత్‌లో నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్‌.. రూ. 500 కాగితాలను ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

Exit mobile version