Home Lifestyle Do you know Toll Charges Free | ఇలా అయితే మీ వాహనానికి టోల్‌ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం...

Toll Charges Free | ఇలా అయితే మీ వాహనానికి టోల్‌ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే !

Toll Charges Free | ఊర్లకు వెళ్లేప్పుడో.. వచ్చేప్పుడో ఎప్పుడో ఒకసారి టోల్ ట్యాక్స్‌ కట్టే ఉంటారు కదా. టోల్‌ గేట్‌ వచ్చినప్పుడల్లా మన వాహనాన్ని ఫ్రీగా పంపిస్తే బాగుండు అనిపిస్తుంటుంది. కానీ అలాంటి అవకాశం కొద్ది మంది ప్రముఖులు, అంబులెన్స్‌లకు మాత్రమే ఉంది. అయితే టోల్ ట్యాక్స్ కట్టకుండా మనం కూడా వెళ్లొచ్చట. మనకూ టోల్ చార్జీలు కట్టకుండా మినహాయింపులు ఉంటాయట. ఎలా అనుకుంటున్నారా?

ఎప్పుడు పడితే అప్పుడు టోల్‌ చార్జీలు మినహాయింపులు ఉండవు. కొన్ని సందర్బాల్లో మాత్రమే టోల్ చార్జీలు చెల్లించకుండా ఫ్రీగా వెళ్లిపోవచ్చు. టోల్ గేట్ నుంచి 200 మీట‌ర్ల దూరం వ‌ర‌కు ట్రాఫిక్ జామ్ అయితే మనం టోల్ క‌ట్ట‌కుండానే గేట్ దాటి వెళ్ల‌వ‌చ్చు.

టోల్ గేట్‌కు కొద్ది దూరంలో ఒక పసుపు రంగు లైన్ ఉంటుంది. ఆ లైన్‌కు అవ‌త‌ల ఎవ‌రైనా 5 లేదా అంత‌క‌న్నా ఎక్కువ నిమిషాల పాటు వేచి ఉన్న‌ట్ట‌యితే వారు కూడా టోల్ క‌ట్టాల్సిన ప‌నిలేదు. నేరుగా గేట్ నుంచి వెళ్లిపోవ‌చ్చు. కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి సంద‌ర్భాలు గనక ఎదురైతే టోల్ చెల్లించ‌కండి. ఒక వేళ టోల్ సిబ్బంది ఇబ్బంది పెట్టినా, వాదించినా.. ఈ 2 రూల్స్ ను క‌చ్చితంగా చెప్పండి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

Exit mobile version