Home Lifestyle Do you know Train mileage | లీటర్‌ డీజిల్‌కు.. రైలు ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసా.. ఎప్పుడైనా ఆలోచించారా...

Train mileage | లీటర్‌ డీజిల్‌కు.. రైలు ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసా.. ఎప్పుడైనా ఆలోచించారా ?

Image by jeswin on Freepik

Train mileage | బైక్‌, కారు కొత్తది కొంటున్నా.. ఎక్కడికైనా వెళ్లాలన్నా ప్రతి ఒక్కరూ ఆలోచించేది మైలేజీ గురించే. లీటర్‌ పెట్రోల్‌కు ఎంత మైలేజీ ఇస్తుంది అనేదానిపైనే దృష్టి పెడతాం. నలుగురు కారులో వెళితే ఎంత ఖర్చు వస్తుందనే ఆలోచిస్తాం కదా. మరి వేల మందిని ఒకేసారి గమ్యస్థానాలకు చేర్చే రైళ్లు ఎంత మైలేజీ ఇస్తాయనే అనుమానం ఎవరికైనా వచ్చిందా? ఇదిగో ఈ సమాచారం మీకోసమే..

ఒకప్పుడంటే బొగ్గు, స్లీమ్‌, ఎలక్ట్రిక్‌ రైళ్లు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు డీజిల్‌తో నడిచే రైళ్లు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా ఇంజిన్‌ సామర్థ్యాన్ని బట్టి డీజిల్‌ ట్యాంకు ఉంటుంది. ముఖ్యంగా డీజిల్‌తో నడిచే రైళ్లలో మూడు రకాలు ఉంటాయి. 5వేలు, 5వేల 500, 6వేల లీటర్ల సామర్థ్యం కలిగిన డీజిల్‌ ఇంజిన్లు ఉంటాయి.

ఇక మైలేజీ విషయానికి వస్తే అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. డీజిల్ ఇంజిన్‌తో నడిచే 12 కోచ్‌లు ఉన్న ప్యాసింజర్ రైలు 6 లీటర్లకు ఒక కిలోమీటరు మైలేజీని ఇస్తుంది. అంటే వంద కిలోమీటర్లు ప్రయాణించాలంటే 600 లీటర్ల డీజిల్‌ అవసరం అన్నమాట. 24 కోచ్‌ల ఎక్స్‌ప్రెస్ రైలు కూడా 6 లీటర్లకు ఒక కిలోమీటర్‌ మైలేజీ ఇస్తుంది. ఇక 12 కోచ్‌లతో వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిలోమీటర్‌ ప్రయాణించాలంటే 4.50 లీటర్ల డీజిల్‌ అవసరం అవుతుందట.

ఇంతకీ ప్యాసింజర్ రైలు, ఎక్స్‌ప్రెస్ రైలు మైలేజీకి మధ్య ఇంత తేడా ఎందుకంటే.. ప్యాసింజర్ రైలు అన్ని స్టేషన్‌లలో ఆగుతూ నడుస్తుంది. దీంతో రైలులోని బ్రేకులు, యాక్సిలరేటర్లను ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఎక్స్‌ప్రెస్ రైలుతో పోలిస్తే ప్యాసింజర్ రైలు మైలేజీ తగ్గుతుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాప్‌లు చాలా తక్కువగా ఉంటాయి. వాటికి బ్రేకులు, యాక్సిలరేటర్ల వినియోగం కూడా తక్కువగా ఉంటుంది.

గూడ్స్ రైలులోని కోచ్‌ల సంఖ్య, రైలులో తీసుకెళ్తున్న సరుకును బట్టి మైలేజీని నిర్ణయిస్తారట. అందుకే దీన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టమే అంటున్నారు. ఏ గూడ్స్ రైలులో అయితే లోడ్ ఎక్కువగా ఉంటుందో దాని ప్రకారం దాని మైలేజీ ఉంటుంది.

రైల్వే స్టేషన్‌లో రైలు ఎంతసేపు నిలిచి ఉన్నా.. ఇంజన్ ఆఫ్ చేయరు. మీరు కూడా గమనించే ఉంటారు కదా. ఇలా ఆన్‌లోనే ఉంచడానికి రెండు కారణాలు ఉన్నాయి. డీజిల్ ఇంజిన్‌ను ఆన్ చేసిన తర్వాత, బ్రేక్ పైన పీడనం చాలా తక్కువగా ఉంటుంది. ఇది తిరిగి అదే సామర్థ్యానికి రావడానికి చాలా సమయం పడుతుంది.

డీజిల్ ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి సాధారణంగా 20-25 నిమిషాలు పడుతుంది. అందువల్ల, డీజిల్ ఇంజిన్‌ను ఆపివేయడానికి బదులు దాన్నిఅలాగే కొనసాగిస్తారు. ఒకవేళ ఇంజిన్‌ ఆఫ్‌ చేస్తే.. మళ్లీ స్టార్ట్‌ చేయడానికి 40 నుంచి 50 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

Exit mobile version